Dubai Expo: అదో ఇసుక ఎడారి.. ఇప్పుడు అంతర్జాతీయ ఎగ్జిబిషన్!

అది ఒకప్పుడు ఇసుకు ఎడారి.. కానీ, ఇప్పుడు అంతర్జాతీయ ఎగ్జిబిషన్ గా మారిపోయింది. ఎనిమిదేళ్లుగా ఈ ఇసుక ఎడారిని అద్భుతమైన వినోద వేదికగా తీర్చిదిద్దేందుకు దుబాయ్ 8ఏళ్లుగా శ్రమించింది.

Dubai Expo: అదో ఇసుక ఎడారి.. ఇప్పుడు అంతర్జాతీయ ఎగ్జిబిషన్!

Dubai Expo Opens, Bringing First World's Fair To Mideast

Updated On : October 2, 2021 / 1:18 PM IST

Dubai Expo Opens : అది ఒకప్పుడు ఇసుకు ఎడారి.. కానీ, ఇప్పుడు అంతర్జాతీయ ఎగ్జిబిషన్ గా మారిపోయింది. ఎనిమిదేళ్లుగా ఈ ఇసుక ఎడారిని అద్భుతమైన వినోద వేదికగా తీర్చిదిద్దేందుకు దుబాయ్ ఎనిమిదేళ్లుగా శ్రమించింది. దీనికోసం బిలియన్లకు పైగా డాలర్లు ఖర్చు చేసింది. ఏళ్ల తరబడి నిరీక్షణ తర్వాత మధ్యప్రాచ్యంలో దుబాయ్‌లో తొలి వరల్డ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఎట్టకేలకు పూర్తయింది.
Rashmika Mandanna : అండర్వేర్ యాడ్ లో రష్మిక.. ఈ యాడ్ ఎలా చేసావంటూ భారీ ట్రోలింగ్

ఇప్పుడు ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే మధ్యప్రాచ్యంలో ఏర్పాటైన తొలి అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌గా రికార్డులకెక్కింది. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఇంటర్నేషన్ ఎక్స్ పో 2020 ఆలస్యమైంది. కరోనా ప్రభావం దీనిపై పడింది. చివరికి అద్భుతమైన అంతర్జాతీయ ఎగ్జిబిషన్ గా రూపుదిద్దుకుంది. మొత్తం 190 దేశాలకు సంబంధించిన పెవిలియన్స్‌ ఇందులో ఉన్నాయి.

మొత్తం 1080 ఎకరాల్లో (438 హెక్టార్లు) నిర్మించిన ఈ ఎగ్జిబిషన్‌ దాదాపు ఆరు నెలల పాటు దేశవిదేశాలకు చెందిన పర్యాటకులను ఆకర్షించనుంది. స్పేస్‌ ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రెప్లికా, అమెరికా మూడో అధ్యక్షుడు ఉపయోగించిన ఖురాన్, ట్రాన్స్‌ఫార్మర్‌ చైనా కారు (SAIC Motor).. ఇది ఒకరోజు సబ్ మెరైన్ మాదిరిగా, హెలికాప్టర్ లా పనిచేస్తుంది. 20 లక్షల ప్లాస్టిక్‌ బాటిళ్లతో తయారైన 70 కిలోమీటర్ల (40మైళ్లు) ఇటలీ రోప్, మైఖెలాంజెలో చెక్కిన బైబిల్‌ హీరో డేవిడ్‌ త్రీడీ డాల్ లాంటి ఎన్నో పర్యాటకులను ఆకట్టుకోనున్నాయి.
El Salvador Cryptocurrency : చిన్నదేశం..గొప్ప ఆలోచన..అగ్నిపర్వతాల నుంచి బిట్‌కాయిన్‌ తయారీ ఘనత