E-scooter fire accident : ఈ-స్కూటర్‌లో పేలిన బ్యాటరీ.. చెలరేగిన మంటలు.. భయం పుట్టించే వీడియో

ఒక్కోసారి ప్రమాదాలు అనూహ్యంగా జరుగుతుంటాయి. లండన్ లోని ఓ ఇంట్లో నిలిపి ఉన్న ఈ-స్కూటర్ ఒక్కసారిగా మంటలతో పేలిపోయింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు.

E-scooter fire accident : ఈ-స్కూటర్‌లో పేలిన బ్యాటరీ.. చెలరేగిన మంటలు.. భయం పుట్టించే వీడియో

E-scooter fire accident

Updated On : May 20, 2023 / 12:30 PM IST

Viral video in London : లండన్ లోని ఓ ఇంట్లో ఈ-స్కూటర్ లో మంటలు చెలరేగాయి. అక్కడి అగ్నిమాపక సిబ్బంది ట్విట్టర్ లో షేర్ చేసిన ఈ వీడియో భయం పుట్టిస్తోంది.

Kerala : వృద్ధుడి చొక్కా జేబులో పేలిన ఫోను.. ఆయుష్షు ఉండటంతో బ్రతికిపోయాడు…

లండన్ లోని డెల్ విలియమ్స్ అనే వ్యక్తి ఇంట్లో నిలిపి ఉన్న ఈ-స్కూటర్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బ్యాటరీ పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ ఎవరూ ఈ ఘటనలో గాయపడలేదు. London Fire Brigade వారు ఈ ఘటనను వివరిస్తూ వీడియోను షేర్ చేశారు. ప్రమాదం జరిగినప్పుడు డెల్ విలియమ్స్ ప్రమాదాన్ని ఆపడానికి దుప్పటితో కప్పడానికి ప్రయత్నం చేశాడు. కానీ విపరీతమైన పొగ కారణంగా అతను ఆ ప్రయత్నం చేయలేకపోయాడు. చివరికి అతను కుటుంబంతో బయటకు పరుగులు తీయాల్సి వచ్చింది. ఆ తరువాత అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

Dehradun Fire Accident : బాబోయ్.. బాంబులా పేలిన గ్యాస్ సిలిండర్, నలుగురు సజీవదహనం

ఈ ప్రమాదం నుంచి బయటపడి ప్రాణాలు దక్కించుకున్న డెల్ విలియమ్స్ కుటుంబం ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. పొగ పీల్చడంతో కలిగిన ఇబ్బంది కారణంగా చికిత్స తీసుకోవాల్సి వచ్చిందట. చిన్న ఇబ్బంది తప్ప పెద్ద ప్రమాదం నుంచి కాపాడిన దేవుడికి.. అగ్నిమాపక సిబ్బందికి నేను చాలా కృతజ్ఞుడను అని డెల్ విలియమ్స్ ఒక ప్రకటనలో తెలిపాడు.