భారీ భూకంపం : మళ్లీ వణికిన ఇండోనేషియా

  • Published By: madhu ,Published On : September 26, 2019 / 05:15 AM IST
భారీ భూకంపం : మళ్లీ వణికిన ఇండోనేషియా

Updated On : September 26, 2019 / 5:15 AM IST

ఇండోనేషియాను మరోసారి భూకంపం వణికించింది. మలుకు దీవులలో సెప్టెంబర్ 26వ తేదీ గురువారం ఉదయం 8.46 సమయంలో భారీ భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గరయ్యారు. ఫ్రాణాలు రక్షించుకోవడానికి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్‌పై 6.5గా నమోదైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి సునామీలాంటి హెచ్చరికలు జారీ చేయడం లేదన్నారు. 

మలుకు ప్రావిన్స్‌లోని అంబోన్‌కు 37 కి.మీ దూరంలో 29 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు. అయితే..ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. భారీ భూకంపం రావడంతో భవనాలు కుప్పకూలాయి. 

ఇండోనేషియాలో భూకంపం రావడం పరిపాటిగా మారింది. గతంలో అనేకసార్లు భూమి కంపించింది. దీంతో ఎంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిన సంగతి తెలిసిందే. 2004, 2018లో వచ్చిన భూకంపం కారణంగా భారీ ప్రాణ నష్టం జరిగింది. భూకంపం అనగానే ప్రజలు గజగజ వణికిపోతుంటారు. సునామీ వస్తుందోమనన్న భయం వారిలో నెలకొంటుంది. అయితే..ఈసారి వచ్చిన భూకంపం తీవ్రత ఎక్కువగా ఉన్నా సునామీకి అవకాశం లేదని వాతావరణ శాఖ స్పష్టం చేయడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.