ఘోర రోడ్డు ప్రమాదం : 28మంది దుర్మరణం

ఈజిప్ట్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వర్కర్స్ తో వెళ్తున్న మినీ బస్సు.. ట్రక్కుని ఢీకొట్టింది. ఈ ఘటనలో 22మంది చనిపోయారు. ఉత్తర ఈజిప్ట్ లో సూజ్ కెనాల్ సిటీలో హైవేపై

  • Published By: veegamteam ,Published On : December 29, 2019 / 03:38 AM IST
ఘోర రోడ్డు ప్రమాదం : 28మంది దుర్మరణం

Updated On : December 29, 2019 / 3:38 AM IST

ఈజిప్ట్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వర్కర్స్ తో వెళ్తున్న మినీ బస్సు.. ట్రక్కుని ఢీకొట్టింది. ఈ ఘటనలో 22మంది చనిపోయారు. ఉత్తర ఈజిప్ట్ లో సూజ్ కెనాల్ సిటీలో హైవేపై

ఈజిప్ట్ లో రహదారులు రక్తమోడాయి. గంటల వ్యవధిలో రెండు వేర్వేరు చోట్ల  ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 28మంది చనిపోయారు. వర్కర్స్ తో వెళ్తున్న మినీ బస్సు.. ట్రక్కుని ఢీకొట్టింది. ఈ ఘటనలో 22మంది చనిపోయారు. ఉత్తర ఈజిప్ట్ లో సూజ్ కెనాల్ సిటీలో హైవేపై శనివారం(డిసెంబర్ 28,2019) ఈ ఘటన జరిగింది. ఓ గార్మంట్ ఫ్యాక్టరీ నుంచి లేబర్స్ ని మినీ బస్సులో తరలిస్తున్నారు. రాజధాని కైరోకి 200 కిలోమీటర్ల దూరంలోని డమెట్టా సిటీ ఉంది. అక్కడి నుంచి వర్కర్లను మినీ బస్సులో మరో చోటుకి తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్ లో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇక మరో ప్రమాదంలో టూరిస్టులతో వెళ్తున్న బస్సు.. ట్రక్కుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భారతీయుడు సహా 6మంది చనిపోయారు. బస్సులో 26మంది టూరిస్టులు ఉన్నారు. టూరిస్టులు హర్‌ఘడా నగరానికి వెళుతుండగా.. సోఖ్నా-ఝఫరానా ప్రాంతంలో శనివారం(డిసెంబర్ 28,2019) ఈ ప్రమాదం జరిగింది. పర్యాటకులతో రెండు బస్సులు వెళ్తున్నాయి. ముందు బస్సు ట్రక్కుని ఢీకొట్టింది. ఈ క్రమంలో వెనకాలే వస్తున్న మరో బస్సు కూడా ముందు బస్సుని ఢీకొట్టింది. రెండో బస్సులో ఆసియాకు చెందిన పర్యాటకులు ఉన్నారు.

చనిపోయిన వారిలో ఓ భారతీయుడు, ఇద్దరు మలేషియావాసులు, ముగ్గురు ఈజిప్ట్ దేశస్తులు ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపారు. మరో 20మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని సూయెజ్‌, కైరోలోని ఆసుపత్రులకు తరిలించి చికిత్స అందిస్తున్నారు. భారత రాయబార ప్రతినిధులు ప్రస్తుతం ఆసుపత్రుల్లోనే ఉన్నారు. సాయం కోసం +20-1211299905, +20-1283487779 హెల్ప్‌ లైన్‌ నెంబర్లు ఏర్పాటు చేశారు.