Electric Vehicle : ఎలక్ట్రిక్ వాహన రంగంలో గిన్నిస్ రికార్డు

యూరప్ కు చెందిన ఫ్యూచరికం కంపెనీ రికార్డు క్రియేట్ చేసింది. ట్రక్ ను ఒక్కసారి ఛార్జ్ చేసి ఏకంగా 1,099 కిలోమీటర్లమేర ప్రయాణించి గిన్నిస్ వరల్డ్ రికార్డును నమోదు చేసింది.

Electric Vehicle : ఎలక్ట్రిక్ వాహన రంగంలో గిన్నిస్ రికార్డు

Electric Vehicle

Updated On : September 13, 2021 / 10:51 AM IST

Electric Vehicle : ప్రపంచ దేశాల దృష్టి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లింది. పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిసారించాయి. పెట్రోల్ నిల్వలు తగ్గిపోతుండటం.. పలు దేశాల్లో పెట్రోల్ ధరలు అధికంగా ఉండటంతోపాటు కాలుష్యం పెరిగిపోతుండటంతో ప్రజలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు. ఇక వినియోగదారుల అభిరుచికి తగినట్లు కంపెనీలు వాహనాలను తయారు చేస్తున్నాయి.

Read More : Yogi Adityanath : ఉగ్ర‌వాదానికి మాతృమూర్తి కాంగ్రెస్‌… యోగి సంచలన కామెంట్స్!

కొన్ని కంపెనీలు ప్యాసెంజర్ వాహనాలనే కాకుండా సరుకు రవాణాకు ఉపయోగించే ట్రక్కులను కూడా తయారు చేస్తున్నాయి. ఎలక్ట్రిక్‌ ట్రక్కులపై దిగ్గజ కంపెనీలు మెర్సిడెజ్‌ బెంజ్‌, వోల్వో వంటి కంపెనీలు దృష్టిసారించాయి. ఇప్పటికే ప్లాంట్లు ఏర్పాటు చేసి తయారి షురూ చేశాయి. ఇక ఇదిలా ఉంటే యూరప్ కు చెందిన ఫ్యూచరికం కంపెనీ రికార్డు క్రియేట్ చేసింది. ఒక్కసారి ఛార్జ్ చేసి ఏకంగా 1,099 కిలోమీటర్లమేర ప్రయాణించి గిన్నిస్ వరల్డ్ రికార్డును నమోదు చేసింది. ఒకసారి ఛార్జ్ తో ఇంతదూరం ప్రయాణించే కార్లు కూడా మార్కెట్లో చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ఫ్యూచరికం ట్రక్ 1,099 కిలోమీటర్లు వెళ్లి సంచలనం సృష్టించింది.

Read More : Gold Rate : శుభవార్త.. మరోసారి తగ్గిన పసిడి ధర

డిపీడీ స్విట్జర్లాండ్‌, కాంటినెంటల్‌ టైర్స్‌ భాగస్వామ్యంతో వోల్వో ట్రక్‌ యూనిట్‌ను మాడిఫై చేసి ఫ్యూచరికం ట్రక్‌ను డెవలప్‌ చేసింది. ఇక దీని టెస్ట్ డ్రైవ్ లో ఇద్దరు డ్రైవర్లు పాల్గొన్నారు. సుమారు 23 గంటల్లో 392 ల్యాప్ లను పూర్తి చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఇక ఈ సందర్భంగా డీపీడీ స్విట్జర్లాండ్‌ స్ట్రాటజీ అండ్‌ ఇన్నోవేషన్‌ డైరక్టర్‌ మార్క్‌ ఫ్రాంక్‌ మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్‌ మొబిలిటీ రంగంలో ఇదొక సంచలన విజయమని పేర్కొన్నారు. ఫ్యూచరికం కంపెనీ ఎలక్ట్రిక్‌ ట్రక్‌లో సుమారు 680​కేడబ్య్లూహెచ్‌ బ్యాటరీను ఉపయోగించినట్లు కంపెనీ పేర్కొంది. ఇక ఈ ట్రక్‌ పూర్తి బరువు 19 టన్నులు. 680కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో సుమారు 680హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేయనుంది. దీనికి మరికొన్ని హంగులు అద్ది మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.