Elon Musk : అంగారకుడిని అందుకుందాం..స్పేస్ క్రాఫ్ట్‌లో మార్స్‌ మీదకు వెళ్తే ఇలా ఉంటుందని చూపిన ఎలాన్ మస్క్..

అంగారకుడిని అందుకుందాం..ఇది సాధ్యమేనంటున్నారు ఎలాన్ మస్క్ .స్పేస్ క్రాఫ్ట్‌లో మార్స్‌ మీదకు వెళ్తే ఇలా ఉంటుందని ఓ వీడియోతో కళ్లకు కట్టినట్లుగా చూపించారు ఎలాన్ మస్క్..

Elon Musk : అంగారకుడిని అందుకుందాం..స్పేస్ క్రాఫ్ట్‌లో మార్స్‌ మీదకు వెళ్తే ఇలా ఉంటుందని చూపిన ఎలాన్ మస్క్..

Elon Musk Released Flying Over Mars In A Spacecraft

Updated On : February 17, 2022 / 4:36 PM IST

Elon Musk released flying over Mars in a spacecraft : అంగారక యాత్ర. సామాన్యుని ఊహకు సైతం అందనిది. గురుగ్రహంపైకి అలా వెళ్లి…ఇలా వచ్చేయొచ్చు. అవసరమైతే అక్కడే ఉండిపోవచ్చు అనేలా పరిశోధనలకు పెట్టుబడులు పెడుతున్నారు ద గ్రేట్ ఎలాన్ మస్క్. ఇదేదో కలలో కాదు నిజమననేలా పరిశోనలు జరుగుతున్నాయి. బ్రాన్సన్, బెజోస్‌లానే ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్…ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు కలలు కనడమే కాదు…ఆ దిశగా సాగుతున్న ప్రయోగాలకు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. స్పేస్ క్రాఫ్ట్‌లో మార్స్‌ మీదకు వెళ్లొస్తే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టేలా తెలియచేస్తూ ఓ వీడియో విడుదల చేశారు.

అత్యంత శక్తిమంతమైన రాకెట్…నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిరింది. భూ ఉపరితలం దాటడం, భూమ్యాకర్షణ శక్తి కోల్పోయి….కక్ష్యలో ప్రవేశించడం మాత్రమే ఆ రాకెట్ లక్ష్యం కాదు. మనిషి మనుగడకు ఆవాసయోగ్యమైన ప్రాంతంగా ప్రచారం జరుగుతున్న అంగారకుడిపై అడుగుపెడుతుందీ రాకెట్. చుట్టూ కొండలతో, కళ్లు జిగేల్‌మనే లైటింగ్‌తో అచ్చంగా భూమిలాగే కనిపిస్తున్న గురు గ్రహం కి రాకెట్ చేరగానే తలుపులు తెరుచుకుంటాయి. వ్యోమగాముల ఆకారంలో ఉన్న పర్యాటకులు అంగారకుడి అందాలను కళ్లార్పకుండా చూస్తుంటారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ వీడియోలో దృశ్యం ఇది. కొన్ని రోజుల క్రితం ఎలాన్ మస్క్ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అంతరిక్ష రంగంలో మస్క్ లక్ష్యాలను చాటిచెప్పడమే కాదు…. ప్రతి ఒక్కరినీ అంగారక లోకంలో విహరింపచేసిందీ వీడియో. అంగారకుడిపై అందమైన నగరం ఇది మన జీవితకాలంలోనే సాధ్యం అంటూ ఆయన ఇచ్చిన క్యాప్షన్ అందరికీ మరో ప్రపంచంపై ఆశలు రేకెత్తిస్తోంది. సామాన్యులకు ఆశ్చర్యం కలిగిస్తోంది.

Also read :  Elon Musk: 2022లో ఫస్ట్ డే.. మస్క్ ఆదాయం రూ. 2.53లక్షల కోట్లు

టెస్లా కార్ల ఉత్పత్తితో ప్రపంచంలోనే సంపన్నుడిగా ఎదిగిన మస్క్ జీవిత లక్ష్యం కేవలం రోడ్లమీద తిరిగే కార్లు మాత్రమే కాదు.అంతకు మించి ఉంటాయి మస్క్ ఆలోచనలు. ఆయన ఆలోచనలను కూడా మేధావులు సైతం అందుకోలేరు అంటూ అతిశయోక్తి కాదు. కారులో రోడ్డు మీద ప్రయాణించినంత వేగంగా స్పేస్ క్రాఫ్ట్‌లో మనిషిని అంతరిక్షానికి వెళ్లేలా చేయడం మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన అనుకున్నారు అంటే అది సాధించి తీరాల్సిందే.. అంతరిక్షాన్ని పర్యాటకానికి స్వర్గధామంగా మార్చేందుకు తన సంపదలో, ఆదాయంలో పెద్దమొత్తాన్ని ఖర్చుచేస్తున్నారు మస్క్.

దీని కోసం స్పేస్ ఎక్స్ అనే సంస్థను నెలకొల్పి..భారీగా ప్రయోగాలు చేయిస్తున్నారు. అవి విఫలమయినా వెనక్కితగ్గేది లేదంటున్నారు మస్క్. ఈక్రమంలో మస్క్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియోతో మార్స్ మీదకు వెళ్లడాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు చెప్పకనే చెప్పారు. ఇది మన జీవితకాలంలోనే సాధ్యమవుతుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు. 2024నాటికి స్పేస్ ఎక్స్ మార్స్‌ మీదకు మనుషులను పంపిస్తుందన్నది మస్క్ నమ్ముతున్నారు. స్టార్ షిప్‌ నౌకతో ఈ కల నెరవేరుతుందన్న భావనలో ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన లాంచింగ్ వెహికల్ స్టార్‌షిప్ అని మస్క్ తెలిపారు. 100 మెట్రిక్ టన్నులకు పైగా బరువును భూకక్ష్యలోకి స్టార్ షిప్ తీసుకెళ్తుందని తెలిపారు.

Also read : Tesla : కార్ల అమ్మకాల్లో రికార్డ్ క్రియేట్ చేసిన ఎలాన్ మస్క్

బెజోస్, బ్రాన్సన్ లేదా ఇతర అంతరిక్ష పర్యాటకులు, శాస్త్రవేత్తలు వెళ్లొచ్చినట్టుగా నింగిలోకి వెళ్లిరావడం మాత్రమే మస్క్ లక్ష్యం కాదు. పక్క ఊరికెళ్లొచ్చినంత తేలిగ్గా…మనుషులు, అంతరిక్షానికి, భూమికి రాకపోకలు సాగించేలా చేయాలన్నది ఆయన జీవితాశయం. అయితే వేల కోట్ల సంపద ఉన్న బిలయనీర్లకు తప్ప…ప్రస్తుతం సాధారణ ప్రజలకు అంతరిక్ష పర్యటన చేయడం సాధ్యం కాదు. అత్యంత సంపన్నులకు మాత్రమే ఇప్పుడు అంతరిక్ష పర్యటన అందుబాటులో ఉంది. సంపద, వయసు, ఇతర పరిస్థితుల ప్రకారం గమనిస్తే….ప్రపంచంలో మొత్తం 1శాతం జనాభా కూడా అంతరిక్ష పర్యటన చేయలేరు. అలాంటప్పుడు మార్స్‌…మనుషులకు అనుకూల గ్రహంగా మారడం అసాధ్యం. అందుకే మస్క్ సంపన్నులతో పాటు ఆర్థికంగా అంత స్థితిమంతులు కాని వారికి సైతం గురుగ్రహయాత్ర అందుబాటులో తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Also read : Tesla : చైనా కార్లా? టెస్లాకు ఇండియా గట్టివార్నింగ్
మస్క్ వీడియోకు ట్విట్టర్‌లో అనూహ్య స్పందన వస్తోంది. అంగారకుడి మీదకు వెళ్లే రాకెట్ సీటును టచ్ చేసినా చాలని తాను భావిస్తున్నానని, ఎందుకుంటే గురుగ్రహంమీదకు వెళ్లేంత స్థోమత తమకు లేదని కొందరు నెటిజ్లను ట్వీట్లు చేస్తున్నారు. అలాగే ఇంకో గ్రహం మీదకు వెళ్లే ప్రయత్నాల కోసం ఊహించలేని మొత్తాన్ని ఖర్చుపెట్టే బదులు ఇప్పుడు మనుషులు జీవిస్తున్న భూగ్రహాన్ని మరింత అనుకూలంగా మలిచేందుకు కృషిచేయాలని సూచిస్తున్నారు. దటీజ్ ఎలాన్ మస్క్. అందుకే ఆయన ప్రపంచ కుబేరుడిగానే కాదు గ్రేట్ బిజినెస్ మాన్ గా పేరొందారు.