Tesla : చైనా కార్లా? టెస్లాకు ఇండియా గట్టివార్నింగ్
చైనాలో తయారు చేసిన టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ కార్లను భారతదేశంలో విక్రయించవద్దని. భారతదేశంలోనే ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలని నితిన్ గట్కారీ తెలిపారు.

Tesla
Tesla : టెస్లా కంపెనీ తమ కార్లను భారత్ కు ఎగుమతి చేసేందుకు తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలోనే దిగుమతి సుంకం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి అనేక సార్లు లేఖలు రాసింది. అయితే కేంద్రం మాత్రం సుంకం తగ్గించేందుకు ముందుకు రావడం లేదు.. ఇక చేస్తే దేశీయ కంపెనీలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని కేంద్రం అభిప్రాయపడుతోంది. ఇదే సమయంలో ఇండియా టెస్లాకు ఓ ఆఫర్ ఇచ్చింది. ఇండియాలో తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలనీ తెలిపింది. ఇందుకు కావలసిన అనుమతులను త్వరితగతిన మంజూరు చేస్తామని వెల్లడించింది.
Read More : ముందు తయారీనే.. దిగుమతి సుంకం తర్వాత చూద్దాం
ఇక ఈ నేపథ్యంలోనే టెస్లా కార్లపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడారు. భారతదేశంలో ఐకానిక్ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని అమెరికాకు చెందిన టెస్లా కంపెనీని అనేకసార్లు కోరినట్లు, అదే సమయంలో సంస్థకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ‘ఇండియా టుడే కాన్ క్లేవ్ 2021’ను ఉద్దేశించి గడ్కరీ మాట్లాడుతూ.. టాటా మోటార్స్ తయారు చేసిన ఎలక్ట్రిక్ కార్లు టెస్లా తయారు చేసిన ఎలక్ట్రిక్ కార్ల కంటే తక్కువ ఏమి కాదని అన్నారు.
Read More : కార్ల అమ్మకాల్లో రికార్డ్ క్రియేట్ చేసిన ఎలాన్ మస్క్
చైనా ఎలక్ట్రిక్ కార్లు విక్రయించొద్దు:
టెస్లా కంపెనీ చైనాలో యూనిట్ ఏర్పాటు చేసి ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తోంది. ఇప్పటికే ఈ కార్లను చైనా రోడ్లపై చెక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాలో తయారు చేసిన మీ కంపెనీ ఎలక్ట్రిక్ కార్లను భారతదేశంలో విక్రయించవద్దు. భారతదేశంలోనే ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలి. ఇంకా అవసరం అయితే టెస్లా కార్లను ఇక్కడ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు” అని ఆయన అన్నారు. పన్ను రాయితీల విషయంలో సంస్థ డిమాండ్ చేసిన వాటి గురుంచి టెస్లా అధికారులతో తాను ఇంకా చర్చలు జరుపుతున్నానని రోడ్డు రవాణా, రహదారుల మంత్రి తెలిపారు.