Tesla Car: ముందు తయారీనే.. దిగుమతి సుంకం తర్వాత చూద్దాం

ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా సీఈఓ ఎల‌న్‌మ‌స్క్‌కు కేంద్రం షాక్ ఇచ్చింది. దిగుమతి సుంకం తగ్గించాలని చేసిన విజ్ఞప్తిపై స్పందిస్తూ...

Tesla Car: ముందు తయారీనే.. దిగుమతి సుంకం తర్వాత చూద్దాం

Tesla Car India

Tesla Car: ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా సీఈఓ ఎల‌న్‌మ‌స్క్‌కు కేంద్రం షాక్ ఇచ్చింది. దిగుమతి సుంకం తగ్గించాలని చేసిన విజ్ఞప్తిపై స్పందిస్తూ ముందుగా ఇండియాలో ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని సూచించింది. ఆ త‌ర్వాతే దిగుమ‌తి సుంకాల‌ను గురించి ఆలోచిస్తామని తేల్చి చెప్పేసిందట.

విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకున్నఏ కంపెనీకి ప్ర‌త్యేక రాయితీలు ఇవ్వలేద‌ని ఇక్కడ ప్రస్తావించింది. టెస్లాకు రాయితీ క‌ల్పిస్తే త‌ప్పుడు సంకేతాలు వెళ‌తాయ‌ని ఇతర ఉత్పత్తుల నుంచి వ్యతిరేకత వస్తుందనే రీతిలో స్పందించింది.

భార‌త్ మార్కెట్‌పై ప‌ట్టు కోసం కొంత‌కాలంగా ప్ర‌య‌త్నిస్తున్న ఎలన్ మస్క్ దిగుమ‌తి సుంకాలు తగ్గించాలని కోరారు. దిగుమ‌తి అయిన కార్ల‌ను విక్ర‌యిస్తామ‌ని, త‌ర్వాతే మాన్యుఫాక్చ‌రింగ్ చేప‌డ‌తామ‌ంటూ ప్ర‌తిపాదిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. దిగుమ‌తి సుంకాల త‌గ్గింపున‌కు టెస్లా భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ఏమిటో వెల్ల‌డించాల‌ని కేంద్రం సూచించింది.

Read Also: New Guidelines : వైరస్ సోకిన 30 రోజుల్లో చనిపోతే కోవిడ్ మరణమే..కేంద్రం కొత్త మార్గదర్శకాలు

ఇండియన్ మార్కెట్‌కు అనువైన టెస్లా మోడ‌ల్ కార్ల‌కు ఇటీవ‌లే కేంద్ర ప్ర‌భుత్వం ధ్రువీక‌రించింది. ఇప్పటివరకూ.. విదేశాల్లో పూర్తిగా త‌యారైన కార్ల‌పై 60 నుంచి 100 శాతం దిగుమ‌తి సుంకం విధించేది. దానిపై తమకు 40 శాతం రాయితీ ఇవ్వాలని టెస్లా కోరింది.