ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ పేరు ఇదేనా..? ఎక్స్‌లో ఆసక్తికర పోస్టు.. రష్యా బంపర్‌ ఆఫర్‌..! ట్రంప్ ఏమన్నారంటే..

ఎలాన్ మస్క్ అమెరికాలో పెట్టబోయే కొత్త రాజకీయ పార్టీ పేరు ఇదేనని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుంది.

ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ పేరు ఇదేనా..? ఎక్స్‌లో ఆసక్తికర పోస్టు.. రష్యా బంపర్‌ ఆఫర్‌..! ట్రంప్ ఏమన్నారంటే..

Updated On : June 7, 2025 / 9:15 AM IST

Elon Musk New political party: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో విభేదాల నేపథ్యంలో ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు వేగంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ‘అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉందా’’ అని ప్రశ్నిస్తూ పోల్ పెట్టాడు. మస్క్ పెట్టిన పోల్ కు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది.

Also Read: ట్రంప్‌, ఎలాన్ మస్క్ మధ్య వివాదం: స్పేస్‌ఎక్స్ ఏం చేయనుంది? ప్రమాదంలో అమెరికా “అంతరిక్ష” భవిష్యత్తు?

మస్క్ పెట్టిన పోల్‌కు 80.4శాతం మంది నెటిజన్లు మద్దతు పలికారు. అమెరికాలో కొత్త పార్టీ అవసరం ఉందని అంటూ ఓటు వేశారు. కేవలం 19.6శాతం మంది మాత్రమే ప్రస్తుతం అమెరికాలో కొత్త పార్టీ అవసరం లేదని ఓటు వేశారు. తాజాగా.. మస్క్ ‘ఎక్స్’లో మరో పోస్టు పెట్టాడు. తాను పెట్టిన పోల్ పై స్పందిస్తూ.. ‘ది అమెరికా పార్టీ’ అని రాశారు. దీంతో ఎలాన్ మస్క్ పెట్టబోయే కొత్త పార్టీపేరు ఇదేనని సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతుంది. ‘ది అమెరికా పార్టీ’ పేరుతో అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని ఎలాన్ మస్క్ ఏర్పాటు చేయబోతున్నాడంటూ ప్రచారం జరుగుతుంది.


రష్యా బంపర్ ఆఫర్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య విబేధాల నేపథ్యంలో ఎలాన్ మస్క్ కు రష్యా బంపర్ ఆఫర్ ప్రకటించింది. రష్యాకు చెందిన స్టేట్ డూమా ఫెడరేషన్ కమిటీ చైర్మన్ దిమిత్రి నోవికోవ్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ఎలాన్ మస్క్ పూర్తిగా భిన్నమైన వ్యక్తి. భిన్నమైన ఆట ఆడతారని నేను అనుకుంటున్నా. ఆయనకు రాజకీయ శరణార్థిగా ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆయన అలా చేయాలనుకుంటే రష్యా సహరిస్తోందని, తమ దేశంలో పొలిటికల్ అసైలమ్ (రాజకీయ శరణార్థి)గా ఉండేందుకు మస్క్ కు అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు.

ట్రంప్ ఏమన్నారంటే..?
ఎలాన్ మస్క్ కొత్త పార్టీ పెడుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై మీడియా ప్రశ్నించగా డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఎలాన్ మస్క్ గురించి నేనేమీ ఆలోచించడం లేదు. చైనా, రష్యా సహా ఇతర విషయాలతో నేను బిజీగా ఉన్నాను. మస్క్ బాగుండాలని అనుకుంటున్నాను అంటూ ట్రంప్ బదులిచ్చారు.