Starlink : ఎలన్ మస్క్ స్టార్‌లింక్.. భారత్‌లో పైలట్ కార్యకలాపాల లైసెన్స్ కోసం దరఖాస్తు
టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్ కి చెందిన స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీసెస్ భారతదేశంలో పైలట్ సేవలను ప్రారంభించడానికి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసింది.

Starlink Internet Services
Starlink : టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్ కి చెందిన స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీసెస్ భారతదేశంలో పైలట్ సేవలను ప్రారంభించడానికి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసింది. ప్రస్తుత అప్లికేషన్ ‘ప్రయోగాత్మక లైసెన్స్’ పొందడం కోసం. ఇది కంపెనీకి పరిమితమైన చందాదారులతో తన సాంకేతిక పరిజ్ఞానాన్ని పైలట్ చేయడానికి సహాయపడుతుంది. అయితే వాణిజ్య సేవలను ప్రారంభించే అధికారం లేదని కంపెనీ తెలిపింది.
స్టార్‌లింక్ ద్వారా ప్రచారం చేయబడే సేవలను అందించడానికి అవసరమైన లైసెన్స్‌లు లేనందున వాటికి సబ్‌స్క్రైబ్ చేయవద్దని కేంద్రం ప్రజలకు సూచించిన కొద్ది రోజులకే ఈ చర్య వచ్చింది. తప్పనిసరి లైసెన్సుల కోసం అధికారిక దరఖాస్తు దాఖలు చేయబడుతుంది. అవసరమైన షరతులు నెరవేరినట్లయితే, తదుపరి కొన్ని నెలల్లో ప్రక్రియ పూర్తవుతుంది.
వాణిజ్య సేవలను ప్రారంభించడానికి, అమెరికన్ కంపెనీకి టెలికాం మంత్రిత్వ శాఖ ఇతర అనుమతులు కాకుండా GMPCS (గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్) లైసెన్స్ అవసరం. స్టార్‌లింక్ మరియు ఇతర ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవల కంపెనీల ప్రణాళిక ఏమిటంటే, దాదాపు 1,000 దూరంలో మోహరింపబడే లో-ఎర్త్ ఆర్బిట్ (LEO) ఉపగ్రహాల ద్వారా 1 GBPS మరియు అంతకంటే ఎక్కువ వేగంతో పెద్ద మొత్తంలో బ్యాండ్ విడ్త్‌ను అందించడం. బ్యాండ్‌విడ్త్ వ్యాపార సంస్థలు, రైల్వేలు, షిప్పింగ్ కంపెనీలు, రక్షణ సంస్థలు, విమానయాన సంస్థలు మరియు టెలికాం కంపెనీలను కలిగి ఉండే వివిధ రకాల వినియోగదారులు/కస్టమర్లకు విక్రయించబడుతుంది.
కొత్త ఉపగ్రహాలతో పాటు నెట్‌వర్క్‌ల ఆప్టిమైజేషన్‌ల ద్వారా ప్రపంచంలోని ప్రతిమూలకూ స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించడానికి స్టార్‌లింక్ సంస్థ శరవేగంగా పనిచేస్తోంది. ఒక్క జులై నెలలోనే ఇండియాలో స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లను వేలాది మంది తీసుకున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా స్టార్ లింక్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల సంఖ్య 90,000 దాటింది. అంతా సవ్యంగా సాగుతోందనుకున్న క్రమంలో ఎలన్ మస్క్‌కు భారత్ షాక్ ఇచ్చింది. ముందస్తు ఆర్డర్లు తీసుకోవడాన్ని ప్రభుత్వం అడ్డుకుంది.
Indians : గూగుల్ నుంచి ట్విట్టర్ వరకు అంతా మనోళ్లే..!
లైసెన్స్ లేకుండా స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ ప్రీ ఆర్డర్స్ తీసుకోవడాన్ని కేంద్రం తప్పుపట్టింది. స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలకు భారత్‌లో ఇంకా లైసెన్స్ లభించలేదన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ 99 డాలర్ల (రూ.7,400)తో బేటా వెర్షన్ సేవలను అందించనున్నట్లు, ఆర్డర్లకు దరఖాస్తు పెట్టుకోవాలంటూ భారతీయులను కోరింది. ముందస్తు ఆర్డర్లు వచ్చినట్లు స్టార్‌లింక్ భారత్ హెడ్ సంజయ్ భార్గవ ఈ మధ్యే వెల్లడించారు. ఈ క్రమంలోనే టెలికమ్యూనికేషన్స్ విభాగం స్టార్ లింక్ సేవలపై అభ్యంతరాలు లేవనెత్తింది.
అంతేకాదు ఇక్కడి రెగ్యులేటర్ ఫ్రేమ్ వర్క్‌కు అనుగుణంగా పని చేయాల్సిందేనని, డాట్ అనుమతులు తప్పనిసరని, లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకోవాలని స్పేస్‌ఎక్స్‌కు టెలికమ్యూనికేషన్స్ విభాగం సూచించింది. అంతేకాదు స్టార్ లింక్‌ను ఎవరూ బుక్ చేసుకోవద్దంటూ జనాలకు టెలికమ్యూనికేషన్స్ విభాగం సూచించింది.
భారత్ లో అందుబాటులోకి రాకముందే.. వినియోగదారులందరికీ 300Mbps వేగంతో ఇంటర్నెట్ సేవలు అందిస్తామని స్టార్ లింక్ కంపెనీ హామీ ఇవ్వడం విశేషం. ప్రస్తుతం ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో వంటి హోమ్ బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలు 30Mbps-1Gbps స్పీడ్‌ల మధ్య మాత్రమే ప్లాన్లను అందిస్తున్నాయి.