కాల్పుల కలకలం : బంగ్లా క్రికెటర్లకు తప్పిన ప్రమాదం

  • Published By: madhu ,Published On : March 15, 2019 / 04:07 AM IST
కాల్పుల కలకలం : బంగ్లా క్రికెటర్లకు తప్పిన ప్రమాదం

Updated On : March 15, 2019 / 4:07 AM IST

న్యూజిలాండ్ దేశంలో జరిగిన కాల్పుల్లో బంగ్లాదేశ్ క్రికెట్ టీం సేఫ్‌గా బయటపడింది. తాము క్షేమంగా ఉన్నట్లు ఆ జట్టు ఆటగాడు తమీమ్‌ ఇక్బాల్‌ ట్వీట్‌ చేశాడు. మార్చి 15వ తేదీ శుక్రవారం క్రైస్ట్‌చర్చ్‌లోని ఆల్‌నూర్ మసీదులో దుండగులు విచక్షణారహితంగా కాల్పులు చేశారు. కాల్పుల్లో 12మంది మృతి చెందారు. పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పులు చేసిన దుండగుల్లో ఒకరిని పోలీసులు పట్టుకుని విచారిస్తున్నారు. 
Read Also: సుప్రీం ఆదేశాలు : శ్రీశాంత్ పై నిషేధం ఎత్తివేత.. BCCI ఆలోచించు

ఆ సమయంలో బంగ్లాదేశ్ క్రికెట్ టీం ఉండడం కలవరపాటుకు గురి చేసింది. ఆ జట్టు సభ్యులు న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. మార్చి 16వ తేదీ శనివారం నుండి మూడో టెస్టుకు సమాయత్తం అవుతోంది. అందులో భాగంగా ప్రార్థనలు చేసేందుకు క్రికేటర్లు ఆల్ నూర్ మసీదుకు వెళ్లారు. కాల్పుల శబ్దం విన్న ఆటగాళ్లు బయటకు పరుగులు తీశారు. బంగ్లా ఆటగాళ్లు సురక్షితంగా బయటపడ్డారని తమీమ్ ఇక్బాల్ వెల్లడించారు. 

Read Also: క్రికెటర్ షమీకి షాక్ : గృహహింస కింద చార్జిషీట్