Epstein files : ఏంటి ఎప్‌స్టన్ ఫైల్స్..? బిల్ క్లింటన్ వీడియోలు బయటకి.. ట్రంప్‌కి సంబంధించి ఫైల్స్ మిస్సింగ్..!

Epstein Files ఎప్‌స్టీన్‌కు చెందిన పలు పత్రాలను అమెరికా న్యాయ‌శాఖ శుక్రవారం (అమెరికా కాలమానం ప్రకారం) విడుదల చేసింది. అయితే, ఇవి విడుదల చేసిన ..

Epstein files : ఏంటి ఎప్‌స్టన్ ఫైల్స్..? బిల్ క్లింటన్ వీడియోలు బయటకి.. ట్రంప్‌కి సంబంధించి ఫైల్స్ మిస్సింగ్..!

Epstein Files

Updated On : December 21, 2025 / 1:18 PM IST

Epstein files : అమెరికా రాజకీయాల్లోనేకాక ప్రపంచ వ్యాప్తంగా ఎప్‌స్టీన్‌ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన అంశం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి అమెరికా న్యాయశాఖ పత్రాలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అమెరికా చరిత్రలోనే అతిపెద్దదిగా భావిస్తున్న ఈ సెక్స్ కుంభకోణం సూత్రధారి జెఫ్రీ ఎప్‌స్టీన్‌‌తో ఆ దేశ రాజకీయ, వ్యాపార ప్రముఖులు, సెలబ్రిటీలకు ఉన్న సంబంధాలను వెల్లడిచేసే లక్షల పేజీల డాక్యుమెంట్లను అమెరికా న్యాయ శాఖ శుక్రవారం విడుదల చేసింది. అమెరికా చట్టసభల ఆదేశాల మేరకు ఈ డాక్యుమెంట్స్‌ను విడుదల చేసింది

Also Read : Gold silver Rates : బంగారం, వెండి కొనేవాళ్లకు శుభవార్త.. నేటి ధరలు ఇవే..

తాజాగా విడుదల చేసిన ఫైళ్లలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఫొటోలు.. మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ రాసలీలలు బయటకొచ్చాయి. డెమొక్రటిక్ పార్టీకి చెందిన మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్‌ల ప్రస్తావన, వారికి సంబంధించిన ఫొటోలు కూడా ఉన్నాయి. ఎప్‌స్టీన్‌కు చెందిన లగ్జరీ చార్టర్డ్ విమానంలో క్లింటన్ ఓ యువతిని తన తొడపై కూర్చోబెట్టుకొని ప్రయాణం చేస్తున్న ఫొటోలతోపాటు హాట్ టబ్బులో ఉన్న ఫొటోలు.. ఎప్‌స్టీన్‌ సహచరి, ఈ కుంభకోణంలో మరో ప్రధాన నిందితురాలు గిస్లైన్ మ్యాక్స్‌వెల్‌తో ఉన్న ఫొటో, బాత్ టబ్‌లో ఓ యువతితో మసాజ్ చేయించుకుంటున్న ఫొటోలు తాజాగా విడుదలైన ఫైళ్లలో ఉన్నాయి. మైక్‌ జాగర్, వూడీ అలెన్, నోమ్‌ ఛామ్‌స్కీ వంటి ప్రముఖుల ఫొటోలు కూడా అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఫైళ్లలో ఉన్నాయి.

Epstein files

వేల ఏళ్ల నాటి భారత ఆయుర్వేద పద్దతులను ఎప్‌స్టీన్‌ తన క్లయింట్‌ల కోసం ఉపయోగించేవారని ది ఆర్ట్ ఆఫ్ గివింగ్ మసాజ్ అనే పేరుతో అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన తాజా ఎప్‌స్టీన్ ఫైళ్లలో వెల్లడించింది. న్యాయ శాఖ విడుదల చేసిన ఫైళ్లలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ఉంది. అయితే, ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఫొటోల్లో, ఫైల్స్‌లో డొనాల్డ్ ట్రంప్‌నకు ఇబ్బంది కలిగించే అంశాలేవీ పెద్దగా లేవు. ఆయనకు సంబంధించి అభ్యంతకరంగా లేని కొన్ని ఫొటోలు మాత్రమే ఉన్నాయి.

Epstein files

ఎప్‌స్టీన్‌కు చెందిన పలు పత్రాలను అమెరికా న్యాయ‌శాఖ శుక్రవారం (అమెరికా కాలమానం ప్రకారం) విడుదల చేసింది. అయితే, ఇవి విడుదల చేసిన కొన్ని గంటల్లోనే కొన్ని ఫైళ్లు మాయం కావడం చర్చనీయాంశంగా మారింది. మాయమైన 468 నంబర్ కలిగిన ఫైళ్లలో ట్రంప్‌తో పాటు మెలానియా, ఎప్‌స్టీన్, ఆయన సన్నిహితురాలు గిస్లైన్ మాక్స్‌వెల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాక.. మరికొన్ని సున్నితమైన అంశాలు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే, వీటి ఉద్దేశపూర్వకంగానే తొలగించారా..? అనుకోకుండా అవి డిలీట్ అయ్యాయా..? అనే విషయాన్ని న్యాయశాఖ స్పష్టం చేయలేదు.

Epstein files

అలసు ఎప్‌స్టీన్‌ సెక్స్ కుంభకోణం ఏమిటి..?
అమెరికన్ ఫైనాన్షియర్, ప్రముఖ ఇన్వెస్టర్ అయిన జెఫ్రీ ఎప్‌స్టీన్ లైంగిక వేధింపుల కేసులో 2004లో తొలిసారి అరెస్ట్ అయ్యాడు. కొంతకాలంకు విడుదలయ్యాడు. ఆ తరువాత మీటూ ఉద్యమ సమయంలోనూ మరోసారి అరెస్టు అయ్యాడు. 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. చాలా ఏళ్లపాటు మైనర్ బాలికలు, యువతులపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్నది ఎప్‌స్టీన్‌పై ప్రధాన ఆరోపణ. అంతేకాక.. 90వ దశకం నుంచి అమెరికాలోని ప్రముఖ రాజకీయ, వ్యాపార ప్రముఖులతోపాటు సెలబ్రిటీలకు ఎప్‌స్టీన్ అమ్మాయిలను సరఫరా చేశాడని, ఈ వ్యవహారంలో అతని సన్నిహితురాలు గిస్లైన్ మాక్స్‌వెల్ సహకరించారన్న అభియోగాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. దర్యాప్తు సంస్థలు సేకరించిన వివరాలను, పత్రాలను విడుదల చేయాలని చాలా ఏళ్లుగా డిమాండ్ నడుస్తోంది. అమెరికా చట్టసభల ఆదేశాల మేరకు న్యాయశాఖ శుక్రవారం ఈ కేసుకు సంబంధించిన వేల కొద్దీ డాక్యుమెంట్స్‌ను విడుదల చేసింది