Europe Covid Deaths : యూరప్ లో మరో 5లక్షల కోవిడ్ మరణాలు..WHO హెచ్చరిక

కొద్ది రోజులుగా యూరప్ దేశాల్లో కోవిడ్ కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఐరోపాలో పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల సంఖ్య

Europe Covid Deaths : యూరప్ లో మరో 5లక్షల కోవిడ్ మరణాలు..WHO హెచ్చరిక

Covid (2)

Updated On : November 4, 2021 / 4:54 PM IST

Europe Covid Deaths కొద్ది రోజులుగా యూరప్ దేశాల్లో కోవిడ్ కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఐరోపాలో పెరుగుతున్న కోవిడ్ -19 కేసులు,మరణాల సంఖ్య ప్రపంచానికి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇటువంటి సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)కీలక వ్యాఖ్యలు చేసింది. వచ్చే ఏడాది ప్రారంభం నాటికల్లా యూరప్ లో మరో 5లక్షల కోవిడ్ మరణాలు సంభవించే ప్రమాదముందని గురువారం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది.

డబ్ల్యూహెచ్‌ఓ యూరప్ డైరెక్టర్ హన్స్ క్లూగే తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ…”యూరోపియన్ ప్రాంతంలోని 53 దేశాలలో ప్రస్తుతం వైరస్ ప్రసార వేగం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఒక అంచనా ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి మరో 5లక్షల COVID-19 మరణాలు నమోదయ్యే అవకాశముంది” అని అన్నారు. WHO లెక్కలో యూరోపియన్ ప్రాంతం…మధ్య ఆసియాలోని కొన్ని దేశాలతో కూడా కలిపి 53 దేశాలు మరియు భూభాగాలకు విస్తరించింది.

ఇక,కరోనా వైరస్ తో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 50 లక్షలు దాటగా.. 50శాతం మరణాలు అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్​, బ్రెజిల్​ దేశాల నుంచే నమోదయ్యాయి.

మరోవైపు,వ్యాక్సినేషన్ నత్తనడకన సాగడం వల్లనే రష్యా, ఉక్రెయిన్, తూర్పు ఐరోపాలోని పలు ప్రాంతాల్లో వైరస్ ఉద్ధృతి ఆందోళకర స్థాయిలో ఉంది. కరోనా వ్యాక్సినేషన్​లో భాగంగా అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో బూస్టర్ డోసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నా.. పేద దేశాల్లోని ప్రజలకు మాత్రం ఇంకా ఒక్క డోసు టీకా కూడా అందలేదు. 130కోట్ల జనాభా ఉన్న ఆఫ్రికాలో కేవలం 5శాతం మందే పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నారు.

ALSO READ Fertilizer To Srilanka : శ్రీలంకకు 100 టన్నుల ఎరువులు పంపిన భారత్