Ever Given Ship : 106 రోజుల తర్వాత ప్రయాణం ప్రారంభించిన ఎవర్ గివెన్ నౌక

ఈ ఏడాది మార్చిలో ఎవర్ గివెన్ షిప్ సూయజ్ కాలువకు అడ్డంగా ఇరుక్కొని ఏడు రోజులపాటు అంతర్జాతీయ వర్తకానికి అడ్డంకిగా మారిన విషయం తెలిసిందే. ఇసుకలో కూరుకుపోయిన ఎవర్ గివెన్ నౌకను పక్కకు తీయడానికి వారం రోజులు పట్టింది. వారం రోజులపాటు నౌకలన్ని ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

Ever Given Ship : 106 రోజుల తర్వాత ప్రయాణం ప్రారంభించిన ఎవర్ గివెన్ నౌక

Ever Given Ship

Updated On : July 8, 2021 / 5:20 PM IST

Ever Given Ship : ఈ ఏడాది మార్చిలో ఎవర్ గివెన్ షిప్ సూయజ్ కాలువకు అడ్డంగా ఇరుక్కొని ఏడు రోజులపాటు అంతర్జాతీయ వర్తకానికి అడ్డంకిగా మారిన విషయం తెలిసిందే. ఇసుకలో కూరుకుపోయిన ఎవర్ గివెన్ నౌకను పక్కకు తీయడానికి వారం రోజులు పట్టింది. వారం రోజులపాటు నౌకలన్ని ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

షిప్ ల రాకపోకలు లేకపోవడంతో సూయజ్ కెనాల్ అథారిటీకి భారీ నష్టం వచ్చింది. ఈ నష్టం పూడ్చుకునేందుకు ఎవర్ గివెన్ షిప్ యాజమాన్యం 916 మిలియన్‌ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనేక భేటీల తర్వాత 550 మిలియన్ డాలర్లకు ఒప్పందం కుదిరింది. నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే నౌకను వదులుతామని ఈజిప్టు నౌకను తమ ఆధీనంలోకి తీసుకుంది.

తాజాగా ఎవర్ గివెన్ నౌక యజమాని జపాన్‌కు చెందిన షూయీ కిసెన్ కైషా లిమిటెడ్‌ సంస్థ బుధవారం సూయాజ్‌ కాలువ యాజమాన్యంతో ఓ ఒప్పందానికి వచ్చింది. దీంతో వంద రోజులకుపైగా నడిచిన డ్రామాకు తెరపడింది. ఒప్పందం అనంతరం ఎవర్ గివెన్ నౌక మధ్యధరా సముద్రం వైపు కదిలింది. ఒప్పందం ప్రకారం నౌకపై ఉన్న అన్ని కేసులను కొట్టివేశారు.