ఈ ఎర్రర్ మెసేజ్ వస్తుందా? : నిలిచిపోయిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ 

సోషల్ మీడియా యూజర్లకు షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన సోషల్ మీడియా యాప్స్ ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సర్వీసులు నిలిచిపోయాయి.

  • Published By: sreehari ,Published On : November 19, 2019 / 07:21 AM IST
ఈ ఎర్రర్ మెసేజ్ వస్తుందా? : నిలిచిపోయిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ 

Updated On : November 19, 2019 / 7:21 AM IST

సోషల్ మీడియా యూజర్లకు షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన సోషల్ మీడియా యాప్స్ ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సర్వీసులు నిలిచిపోయాయి.

సోషల్ మీడియా యూజర్లకు షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన సోషల్ మీడియా యాప్స్ ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సర్వీసులు నిలిచిపోయాయి. సర్వీసులకు అంతరాయం ఏర్పడంతో సోషల్ మీడియా యూజర్లంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు. కంగారుపడకండి.. అంతటా కాదులేండీ.. కొన్ని దేశాల్లో మాత్రమే ఈ అంతరాయం కలిగినట్టు రిపోర్టులు తెలిపాయి.

యూఎస్, యుకేలోని కొన్ని ప్రాంతాల్లో బగ్ కారణంగా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సర్వీసులకు ఆటంకం ఏర్పడినట్టు నివేదించాయి. డౌన్ డెటెక్టర్ వెబ్ సైట్ ప్రకారం.. ఫేస్ బుక్ మొత్తం నెట్ వర్క్ పై ఈ బగ్ ప్రభావం చూపలేదని, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సర్వీసులు నిలిచిపోయినట్టు తెలిపింది. సోషల్ మీడియా యూజర్లు తమ అకౌంట్లో లాగిన్ అయ్యే క్రమంలో ఈ సమస్య తలెత్తినట్టు గుర్తించింది. 

చాలామంది యూజర్లకు లాగిన్ ఎర్రర్ మెసేజ్ లు వస్తున్నట్టు ఫిర్యాదులు చేశారు. మొత్తం 63శాతం సమస్యలు తలెత్తగా అందులో 19శాతం లాగిన్ ఇష్యూలు ఉండగా, 16 శాతం న్యూస్ ఫీడ్‌ లో సమస్యలు తలెత్తినట్టు రిపోర్టు వెల్లడించింది. ఫేస్ బుక్ అకౌంట్ పనిచేయకపోవడంపై యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ఫేస్ బుక్ ప్రతిసారి ఏదో సమస్య వస్తోంది. ఎందుకు FB సరిగా పనిచేయదు. నా కొత్త అకౌంట్లోకి లాగిన్ కాలేకపోతున్నాను. డిసేబుల్ చేశారు’ అంటూ పోస్టు పెట్టాడో యూజర్.  

మరో యూజర్.. ‘సరే.. ఫేస్ బుక్ మెసేంజర్ డౌన్ అయింది. ఫేస్ బుక్ యాప్ నుంచి పంపే మెసేజ్ లు సెండ్ కావడం లేదు.. లోడ్ అంతకన్నా కావడం లేదు’ అని పోస్టు పెట్టారు. సోషల్ నెట్ వర్కింగ్ ప్లాట్ ఫాంపై కలిగిన ఈ అసౌకర్యాన్ని గుర్తించడం లేదా కంపెనీ స్పందించలేదు.

సెప్టెంబర్ నెలలో కూడా యూరప్, యూకే సహా కొన్ని ప్రాంతాల్లో ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సర్వీసులు నిలిచి పోయాయి. వేలాది మంది యూజర్లు ఇబ్బందులు పడ్డారు. దీంతో యూజర్లంతా ట్విట్టర్ వేదికా తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. గత మార్చిలో ఫేస్ బుక్, వాట్సాప్ సర్వీసులు ఏకంగా 14 గంటలకు పైగా నిలిచిపోయాయి. డేటాబేస్ ఓవర్ లోడ్ సమస్య కారణంగానే ఇలా జరిగిందని అప్పట్లో ఫేస్ బుక్ చెప్పుకొచ్చింది.