Covishield : మార్కెట్లో నకిలీ కోవిషీల్డ్..అప్రమత్తంగా ఉండాలన్న డబ్ల్యూహెచ్ వో

ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాల్లో నకిలీ కోవిషీల్డ్ టీకాలు అందుబాటులోకి వచ్చాయని డబ్ల్యూహెచ్ వో హెచ్చరిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా మెలగాలని సూచించింది.

Covishield : మార్కెట్లో నకిలీ కోవిషీల్డ్..అప్రమత్తంగా ఉండాలన్న డబ్ల్యూహెచ్ వో

Covishield

Updated On : August 18, 2021 / 3:48 PM IST

Fake covishield on the market : మనుషుల అవసరాలను ఆసరగా చేసుకుని నకిలీలను పుట్టించడం ప్రపంచ వ్యాప్తంగా కామన్ వ్యవహారంగా మారిపోయింది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు వ్యాక్సిన్లనే ఆశ్రయిస్తున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాల్లో నకిలీ కోవిషీల్డ్ టీకాలు అందుబాటులోకి వచ్చాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. జులై, ఆగస్టు నెలల్లో ఈ నకిలీ టీకాలను ఉత్పత్తి చేశారని చెబుతోంది.

ప్రజలకు వెళ్లిన కొన్ని వైల్స్ టీకాలు నకిలీవి ఉన్నాయని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా ధృవీకరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ఇండియాలోని ఆస్పత్రులు, క్లినిక్స్, ఆరోగ్య కేంద్రాలు, హోల్ సేల్ వ్యాపారులు, డిస్టిబ్యూటర్లు క్షుణ్ణంగా పరిశీలించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తం చేసింది. వివిధ దేశాల్లోని సప్లై చెయిన్లపై నిఘా పెంచాలని సూచించింది. నకిలీ టీకాళ్లను అరికట్టేందుకు ఆయా యంత్రాంగాలు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

భారతదేశంలో 2 మిల్లీ లీటర్ల కోవిషీల్డ్ టీకాలను గుర్తించారు. కానీ ఈ మోతాదులో టీకాలను సీరం సంస్థ ఉత్పత్తి చేయడం లేదు. ఇక ఉగాండాలో ఈనెల 10తో ఎక్స్ పైరీ అయి పోయిన కోవిషీల్డ్ బాష్ ను గుర్తించగా అది నకిలీదంటూ డబ్ల్యూహెచ్ వోకు సీరం స్పష్టం చేసింది. నకిలీ టీకాళ్లతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ వో హెచ్చరించింది. ఇలాంటి వ్యాక్సిన్ల పట్ల అప్రమత్తంగా మెలగాలని సూచించింది.