Emily Ratajkowski : తన విడాకులపై ఆ నటి ఏం చెప్పిందంటే?

ప్రపంచ వ్యాప్తంగా విడాకుల పరంపర కొనసాగుతోంది. ఈ సంవత్సరం చాలామంది సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. తాజాగా నటి, సూపర్ మోడల్ ఎమిలీ రతాజ్‌కోవ్స్కీ విడాకులు తీసుకున్నారు. విడాకులపై ఆమె చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.

Emily Ratajkowski : తన విడాకులపై ఆ నటి ఏం చెప్పిందంటే?

Emily Ratajkowski

Updated On : September 8, 2023 / 6:57 PM IST

Emily Ratajkowski : ఎమిలీ రతాజ్‌కోవ్స్కీ సూపర్ మోడల్, నటి రీసెంట్‍గా విడాకులు తీసుకున్నారు. తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Supreme Court : ప్రేమ వివాహం చేసుకున్నవారే ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఎమిలీ రతాజ్‌కోవ్స్కీ ఒక సున్నితమైన అంశాన్ని టిక్ టాక్‌లో పోస్ట్ చేసారు. అది ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇటీవలే విడాకులు తీసుకున్న ఎమిలీ వీడియోలో ఇటీవల 30 ఏళ్లు నిండకుండానే విడాకులు తీసుకుంటున్న మహిళల గురించి ప్రస్తావించారు. 26 సంవత్సరాలకే పెళ్లి చేసుకుని కొందరు సంవత్సరంలోనే విడిపోతున్నారని.. తన వయసు 32 అని.. విడాకులు తీసుకోవడమంత మంచి పని లేదని ఆమె చెప్పారు. ఈ వయసులో ఇంకా హాట్‌గానే ఉంటారు.. సొంత డబ్బుని కలిగి ఉంటారు.. ఏం చేయాలన్నా చేయగలరు.. మీ జీవితం మీతోనే ముడిపడి ఉంది.. విడాకుల విషయంలో ఎవరైతే ఒత్తిడికి లోనయ్యారో.. వారంతా మంచి పని చేసారు.. కంగ్రాట్యులేషన్స్..  అంటూ విడాకులపై ఆమె తన అభిప్రాయం చెప్పారు. ఎమిలీ రతాజ్‌కోవ్స్కీ వీడియో వైరల్ అవుతోంది.

Sania Mirza And Shoaib Malik : సానియా, షోయబ్ విడాకులు తీసుకున్నారా? మాలిక్ ఇన్‌స్టా బయో మార్పుతో మరోసారి తెరపైకి విడాకుల అంశం..

ప్రపంచ వ్యాప్తంగా ఈ సంవత్సరం చాలామంది సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. రీస్ విథర్‌స్పూన్ , బ్రిట్నీ స్పియర్స్‌ విడాకులు తీసుకోగా.. సోఫీ టర్నర్, జో జోనాస్ విడిపోతున్నట్లు ప్రకటించారు. అరియానా గ్రాండే, డాల్టన్ గోమేజ్ కూడా విడిపోయారు. నచ్చని బంధంతో బలవంతంగా జీవించే కంటే తమ సొంత మార్గంలో నడిచేందుకు చాలామంది జంటలు మొగ్గు చూపుతున్నాయనడానికి సెలబ్రిటీల విడాకులే ఉదాహరణగా చెప్పాలి.

 

View this post on Instagram

 

A post shared by iO Donna (@iodonna_it)