Fierce Winds : ఓ మై గాడ్.. ఇవేం గాలులు రా నాయనా.. మనుషులు ఎలా ఎగిరిపోయారో చూడండి.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో

భీకర గాలులు సృష్టించిన బీభత్సానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. Fierce Winds - Saudi Arabia

Fierce Winds : ఓ మై గాడ్.. ఇవేం గాలులు రా నాయనా.. మనుషులు ఎలా ఎగిరిపోయారో చూడండి.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో

Fierce Winds - Saudi Arabia (Photo : Google)

Updated On : August 24, 2023 / 6:44 PM IST

Fierce Winds – Saudi Arabia : భీకరమైన గాలులు, రాకాసి గాలులు.. దానికి తోడు పెద్ద పెద్ద శబ్దాలతో చెవులకు చిల్లులు పడేలా ఉరుములు, మెరుపులు.. సౌదీ అరేబియాలో భయానకమైన వాతావరణం భయాందోళనకు గురి చేసింది. రాకాసి గాలులు, ఉరుములు, మెరుపులు కాసేపు విధ్వంసం సృష్టించాయి. భారీ గాలులకు ప్రధాన నగరాలు చిగురుటాకులా వణికాయి. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు.

ఉరుములు, మెరుపులు, రాకాసి గాలులతో కూడిన జడి వాన నిలువెల్లా వణుకు పుట్టించింది. స్థానికులు ప్రాణ భయంతో హడలిపోయారు. ఏం జరుగుతుందో అర్థం కాక తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

రాకాసి గాలులకు రోడ్లపై ఉన్న భారీ హోర్డింగులు, టవర్లు నేలకొరిగాయి. దాంతో తీవ్రమైన ఆస్తి నష్టం సంభవించింది. ఇక ప్రసిద్ద నగరాలైన జెద్దా, మక్కాలలోనూ భీకర గాలులు బీభత్సం సృష్టించాయి. ఈ గాలులకు సోఫాలు, కుర్చీలు, ఇతర సామాన్లు గాల్లో కొట్టుకుపోయాయి. అవే కాదు నుషులు కూడా గాలికి ఎగిరిపోవడం తీవ్ర కలకలం రేపింది.

Also Read..Murder For Biryani : ఓ మై గాడ్.. బిర్యానీ కోసం ఘర్షణ, నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య.. వీడియో వైరల్

భీకర గాలులు సృష్టించిన బీభత్సానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు వామ్మో అని గుండె పట్టుకుంటున్నారు. వీడియోలో చూసేవారికే ఇంత భయంకరంగా ఉంటే.. ప్రత్యక్షంగా ఆ బీభత్సాన్ని ఎదుర్కొన్న వారికి ఇంకెంత భయం వేసి ఉంటుందో అని నెటిజన్లు అనుకుంటున్నారు.