Treasure Hunt : వందల కోట్ల విలువైన నిధి కోసం 30 ఏళ్లుగా గాలింపు
వందల కోట్ల విలువైన నిధి కోసం 30 ఏళ్లుగా గాలిస్తున్నారు పరిశోధకులు. ఎన్నో కష్టాలకు ఓర్చుకుంటు నిధికి కొన్ని మీటర్ల దూరానికి వచ్చేమంటున్నారు.

Finland Treasure Hunt (1)
Finland Treasure Hunt నిధుల కోసం వేట. సినిమాల్లో నిధుల వేట ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో. రహస్యాలను ఛేదిస్తు కళ్లు జిగేల్ మనిపించే నిధి తగ్గరకు చేరతారు హీరో ఆయన బృందం. సినిమాల్లోనే అటువంటిసీన్లు చూసినప్పుడు ‘‘ఎక్కడుంటాయి రా బాబూ ఇటువంటి నిధులు’’? అని అనుకుంటుంటాం. కానీ రియల్ గా నిధులు నిజంగా ఉంటాయా? అంటే ఉంటాయనే చెబుతున్నారు పరిశోధకులు.
తాజాగా ఇండోనేషియా ద్వీపమైన సుమత్రా ద్వీపంలో మత్స్యకారులు కోట్లాది విలువ చేసే నిధిని కనుగొన్నారు. అలాగే ఫిన్‌ల్యాండ్‌లో కూడా అటువంటి నిధి నిక్షేపాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. ఇది కేవలం ప్రచారం మాత్రమే కాదు నిజమేనని పరిశోధకులు భావిస్తున్నారు. దీంతో వారి ఆ నిధి గురించి పరిశోధనలు కొనసాగిస్తున్నారు. గత 30 ఏళ్లుగా 12మంది శాస్త్రవేత్తలు గాలిస్తున్నారు.
Read more : Gold Island : బంగారు ఐలాండ్ లో మత్స్యకారులకు దొరికిన లక్షల కోట్ల విలువైన నిధి..!
ఫిన్ ల్యాండ్ లో లెమ్మిన్‌కైనెన్ హోర్డ్ అనే నిధి కోసం 30 ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ లెమ్మిన్‌కైనెన్ అనే నిధి కోసం “ట్వెల్వ్ టెంపుల్” పేరుతో పన్నెండు మంది పరిశోధకుల బృందం 1987 నుండి అన్వేషిస్తోంది.ఈ నిధి ‘ప్రపంచంలోనే అతిపెద్ద నిధి నిధి’ అని దీని విలువ 1500 కోట్లు పైన ఉండచ్చని భావిస్తున్నారు. అంతేకాదు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం..ఈ నిధిలో వజ్రాలు, నీలమణులతో పాటు 50వేలుకు పైగా పురాతన కళాఖండాలు వంటివి ఉంటాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.1000 ఏళ్లనాటి నిధిని చేధించేందకు ఈ పన్నెండు బృందాలు 30 ఏళ్లుగా అన్వేషిస్తునే ఉంది. ఈపరిశోధనల్లో భాగంగా వాళ్ల చాలా కష్ట నష్టాలను చవిచూశారు. అయితే ఇంతవరకు ఎవరు ఈ నిధిని కనుగొన లేకపోయారు.
Read more : Ancient Wine Factory:తవ్వకాల్లో బయటపడ్డ 1500 ఏళ్ల నాటి మద్యం ఫ్యాక్టరీ..పరిశోధనలో విస్తుగొలిపే విషయాలు..
ఈ మేరకు 12మంది పరిశోధకుల బృందం గాలిస్తుండగా..ఆ నిధినిచేరుకోవటానికి తాము అతికొద్ది దూరంలో ఉన్నామని..అతి త్వరలోనే ఈ నిధిని కనుగొంటామని పరిశోధకులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. సిపూలోని భూగర్భ ఆలయంలో నిధి ఉందని..దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో అనేక అన్వేషణలు జరుగుతున్నప్పటికీ..నిధిని ఎవరూ కనుగొనలేకపోయారు. కానీ ఈ 12మంది పరిశోధకుల బృందం మాత్రం ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుని అన్వేషణ సాగిస్తున్నారు.
Read more : Bactrian Treasure : తాలిబన్ల చెరలో బంగారు గనులు.. ఆ బ్యాక్ట్రియన్ ఖజానాను ఏం చేస్తారో?
వారి కష్టానికి ఫలితంగా తాము నిధికి కేవలం మీటర్ల దూరంలోనే ఉన్నామని అంటున్నారు. ఫిన్‌లాండ్ రాజధాని హెల్సింకికి తూర్పున 20 మైళ్ల దూరంలో ఉన్న భారీ సిబ్బోస్‌బర్గ్ గుహలో లెమ్మిన్‌కైనెన్ నిధి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు.ఈ నిధి అన్వేషణ చేస్తున్న పరిశోధకులకు నేతృత్వం వహిస్తున్న సీనియర్ అధికారి మాట్లాడుతూ…నిధి అన్వేషణలో మా బృందం గణనీయమైన పురోగతి సాధించాం. త్వరలోనే ఆ నిధిని గుర్తిస్తాం అని తెలిపారు.