Finland PM filed for divorce : అవును.. వాళ్లిద్దరూ విడిపోతున్నారు..
సామాన్యుల నుంచి ప్రధానుల వరకూ విడాకుల పరంపర కొనసాగుతోంది. రీసెంట్ గా ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్ తన భర్త మార్కస్ రైకోనెన్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

Finland PM filed for divorce
Finland PM filed for divorce : ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల నుంచి దేశ ప్రధానుల వరకూ మినహాయింపు లేకుండా ఉంది. ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్ తన భర్త మార్కస్ రైకోనెన్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
Ghost Husband : దెయ్యం భర్త నుంచి విడాకులు కోరుతున్న భార్య.. వైరల్ అవుతున్న వింత కథ
ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్ భర్త రైకోనెన్ నుంచి విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ప్రకటించారు. 19 సంవత్సరాల జీవిత ప్రయాణంలో తమతో కలిసి ఉన్న కుమార్తెకు కృతజ్ఞతలు చెబుతున్నామని.. ఇకపై మంచి స్నేహితులుగా ఉంటామని ఇద్దరు ప్రకటించినట్లు తెలుస్తోంది. మారిన్, రైకోనెన్ లు తమ 5 సంవత్సరాల కుమార్తె బాధ్యతలను పంచుకున్నారు.
సన్నా మారిన్ సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె భర్తతో పాటు విడిపోతున్నట్లు ప్రకటన చేయడం గమనార్హం. 2019లో మారిన్ అధికారం చేపట్టినప్పుడు ఆమెకు 37 ఏళ్లు.. ప్రపంచంలోనే అతి చిన్న వయసులో ప్రధానమంత్రి పదవి చేపట్టిన వ్యక్తి. చాలామంది మారిన్‌ను రోల్ మోడల్ గా భావిస్తారు.