మెలానియా ట్రంప్ హెల్త్ ఎలా ఉంది? కోవిడ్ 19 ట్రీట్మెంట్ ఎలా సాగుతోంది?

Melania Trump’s COVID-19: తనకు కోవిడ్ వచ్చిందని మెలానియా ట్రంప్ ట్వీట్‌లో చెప్పారు. చాలామంది అమెరికన్స్‌కు వచ్చినట్లే నాకు, ప్రెసిడెంట్‌కు పాజిటీవ్ వచ్చింది. ఇద్దరం ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నామని మెలానియా వెల్లడించారు. ఆమెకు కోటన్నర మంది ట్విట్టర్ ఫాలోవర్స్. అంతే సోషల్ మీడియాలో గగ్గోలు. ఆమెకు హెల్త్ ఎలాగుందని ఒకటే ఎంక్వైరీలు. వాటికీ ఫస్ట్ లేడీయే సమాధానమిచ్చారు. కొద్దిగా లక్షణాలున్నాయి. ఫీలింగ్ గుడ్ అంటూ రిప్లయ్ ఇచ్చారు.
అప్పటి నుంచి Melania సోషల్ మీడియాలో కామ్ అయిపోయారు. మహమ్మారి సమయంలో ఎలా సురక్షితంగా ఉండాలో చెప్పే వీడియోను రీట్వీట్ చేయడం తప్ప కొత్త ఇన్ఫర్మేషన్ లేదు.
తోడుగా ఉన్న ట్రంప్, Walter Reed Medical Centerకి ముందు జాగ్రత్తగా షిఫ్ట్ అయిన తర్వాత, క్వారంటైన్‌లో ఆమె ఒంటరి. ఆదివారం హాస్పటల్‌కి కార్లో వెళ్తూ, ఫ్యాన్స్‌కు హాయ్
చెప్పిన ట్రంప్, ఫస్ట్ లేడీ ఆరోగ్యం మెరుగుపడుతోందంటూ ట్వీట్ కూడా చేశారు.
US President Donald Trump డాక్టర్, Dr. Sean Conley కూడా ఫస్ట్‌లేడీ ఆరోగ్యం గురించి అప్ డేట్ ఇచ్చారు. ట్రంప్ మాటే చెప్పారు. ఆమెకు కొత్తగా కోవిడ్ వైద్యాలేవీ అందించనక్కర్లేదని, కొద్దిగా దగ్గు, తలనొప్పి మాత్రమే ఉందన్నారు.
మెలానియా వయస్సు 50 ఏళ్లు. వైట్‌హౌస్‌లోనే ఉన్నారు. ట్రంప్‌తో పోలిస్తే కోవిడ్ లక్షణాలేవీ విషమించలేదు. ఆమె రెస్ట్ తీసుకొంటున్నారన్నది వైట్‌హౌస్ మాట.