వావ్..విమానంలా గాల్లో ఎగిరే కారు..!! Video

  • Published By: nagamani ,Published On : October 30, 2020 / 03:23 PM IST
వావ్..విమానంలా గాల్లో ఎగిరే కారు..!!   Video

Updated On : October 30, 2020 / 3:43 PM IST

flying car : ఏమో గుర్రం ఎగరావచ్చు అనే మాట విన్నాం కదూ..కానీ కార్లు గాల్లో ఎగురుతాయా?అంటే నిజమే కార్లు గాల్లో ఎగురుతాయి అంటోంది నేటి టెక్నాలజీ. కార్లు గాల్లో ఎగరటం..పడవల్లా మారిపోవటం వంటి సీన్లు జేమ్స్ బాండ్ సినిమాల్లో చూశాం. కానీ అది సినిమా మాయాజాలం కాదు నిజంగానే గాల్లో ఎగిరే కార్లు వచ్చేస్తున్నాయ్..!! ఆల్రెడీ వచ్చేసింది కూడా..



ఈ గాల్లో ఎగిరే కారుని చూస్తే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాల్సిందే. అంత అద్భుతంగా ఉంది..మరి ఆ ఈ AirCarని ఏ కంపెనీ తయారు చేసింది? విమానం గాల్లో ఎగరాలంటే రెక్కలుండాలి కదా..మరి కారుకి రెక్కలుంటాయా? అనే డౌట్ వచ్చేఉంటుంది. మరి ఆ AirCar విశేషాల గురించి తెలుసుకుంటే అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి..మరి తెలుసుకుందాం పదండీ..


స్లోవాకియాలోని ‘క్లెయిన్‌విజన్’ (KleinVision) అనే సంస్థ గాల్లో ఎగిరే కారును తయారు చేసింది. దానికి AirCar అని పేరు పెట్టింది. నేల మీదే కాకుండా గాల్లో కూడా వేగంగా ప్రయాణించే ఈ కారు 2021 కల్లా అందుబాటులోకి రానుందనీ..ఈ కారు భూమికి 1500 అడుగుల ఎత్తులో గంటకు 620 కిమీల వేగంతో కారు దూసుకెళ్తుందని క్లెయిన్‌విజన్ సంస్థ వెల్లడించింది.


ఇటీవల నిర్వహించిన పరీక్షలో ఈ AirCar విజయవంతంగా గాల్లోకి ఎగిరింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. త్వరలో మార్కెట్లోకి రాబోయే ఈ కారును రెండు రకాల వెర్షన్లలో విడుదల చేయనుంది సదరు సంస్థ. వీటిలో ఒకటి టూసీటర్, రెండోది ఫోర్‌ సీటర్. ఇందులో సెల్ఫ్ డ్రైవింగ్ ఆప్షన్ కూడా ఉంటుందట. అంటే.. ఎక్కువ సేపు స్టీరింగ్ పట్టుకోవల్సిన అవసరమే ఉండదన్నమాట.


ఈ కారులో ప్రయాణికుల సేఫ్టీ కోసం పారాచూట్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. ఎమర్జెన్సీ సమయంలో వాటి ద్వారా సురక్షితంగా దిగొచ్చు. విమానానికి వలెనే ఈ కారుకు ఉండే రెక్కలు రోడ్డు మీదకు కారు ల్యాండ్ అవ్వగానే ఆటోమేటిగ్గా ఆ రెక్కలు ముడిచుకుపోతాయి.


దీంతో ఆ AirCar మామూలు కారులాగానే మారిపోతుంది. కేవలం గాల్లోకి వెళ్లే ప్రాసెస్ లో మాత్రమే కారు రెక్కలు విచ్చుకుంటాయి. కేవలం మూడు నిమిషాల్లోనే ఈ కారు.. విమానంలా మారిపోతుంది. మరి.. ఇంకెందుకు ఆలస్యం.. ఈ ఎయిర్ కార్ గాల్లోకి ఎలా ఎగురుతుందో చూసేయండీ..