Thailand : గుడ్డిగా GPS ఫాలో అయితే ఇంతే.. ఓ మహిళ ఎక్కడ చిక్కుకుపోయిందంటే?

వెళ్తే రూట్ చెక్ చేసుకోకుండా ఓ మహిళ పూర్తిగా GPS మీద ఆధారపడి కారు డ్రైవ్ చేసింది. కారుతో పాటు ఆమె ఎక్కడ చిక్కుకుపోయిందంటే?

Thailand : గుడ్డిగా GPS ఫాలో అయితే ఇంతే.. ఓ మహిళ ఎక్కడ చిక్కుకుపోయిందంటే?

Thailand

Updated On : February 1, 2024 / 11:37 AM IST

Thailand : థాయ్‌లాండ్‌లో  ఒక మహిళ కారు నడుపుతూ తాను వెళ్లే మార్గం ఎలా ఉందో చూసుకోకుండా గుడ్డిగా GPS ని ఫాలో అయిపోయింది. కారుతో సహా వెళ్లి ఎక్కడ చిక్కుకుపోయిందో తెలిస్తే షాకవుతారు.

Ayodhya Sri Ram Song : అయోధ్య శ్రీరామ్ స్పెషల్ సాంగ్ విన్నారా? అమెరికా NRI సమర్పణలో..

జనవరి 28.. సాయంత్రం 5.40 గంటలకు థాయ్‌లాండ్‌కి చెందిన పాసర్ మకున్ ఇంచాన్ అనే మహిళ వియాంగ్ థాంగ్ బ్రిడ్జ్‌పై తన కారుతో పాటు చిక్కుకుపోయింది. 120 మీటర్ల పొడవైన ఆ వంతెన కేవలం పాదాచారుల కోసం నిర్మించారట. కారు వంతెనపైకి 15 మీటర్ల ముందుకు వెళ్లింది. కారు ముందున్న ఎడమ చక్రం బ్రిడ్జ్ ఖాళీలో చిక్కుకుపోయింది. దాంతో కారు కదలకుండా ఆగిపోయింది. కారు ఆగిపోవడంతో ఇంచాన్ సహాయం కోసం అరుపులు వేసిందట. అటువైపుగా వెళ్తున్న ఒక వ్యక్తి వెంటనే స్పందించి అందరికీ చెప్పడంతో కారుతో పాటు ఆమెను రక్షించడానికి సహాయక చర్యలు ప్రారంభించారట. ఇంచాన్‌ను ప్రమాదకర పరిస్థితిని నుండి రక్షించినట్లు తెలుస్తోంది.

Ladakh : చైనా సైనికుల‌కు దిమ్మ‌దిరిగే స‌మాధానం చెప్పిన గొర్రెల కాప‌రులు.. నెటిజ‌న్ల మ‌న‌సు గెలుచుకున్న వీడియో

ఈ ఘటనలో ఇంచాన్ చేసిన తప్పిదం ఏంటంటే గుడ్డిగా GPS సూచనలు పాటిస్తూ తాను వెళ్లే మార్గం కూడా గమనించకుండా కారును డ్రైవ్ చేస్తూ వెళ్లడమే. ఈ ఘటనపై చాలామంది నెటిజన్లు నెగెటివ్‌గా స్పందించారు. GPS  సూచిస్తే ఆమె కొండపైకి కూడా వెళ్తుందేమో? అని కామెంట్లు పెట్టారు. వెళ్లే మార్గాన్ని పరిశీలించుకోకుండా గుడ్డిగా GPS మీద ఆధారపడితే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పడానికి ఈ సంఘటన మరోసారి హెచ్చరికగా నిలిచింది.

 

View this post on Instagram

 

A post shared by WeirdKaya (@weirdkaya)