అమ్మంటే అంతే : తల తెగిపడుతున్నా..పిల్లల కోసం తల్లడిల్లింది

  • Published By: nagamani ,Published On : October 30, 2020 / 02:55 PM IST
అమ్మంటే అంతే : తల తెగిపడుతున్నా..పిల్లల కోసం తల్లడిల్లింది

Updated On : October 30, 2020 / 3:34 PM IST

France attack in church : ఫ్రాన్స్ నైస్‌ సిటీలోని నాట్రిడేమ్‌ చర్చిలో ఓ దుండగుడు కత్తితో దాడి చేసిన ఘటనతో దేశం యావత్తు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడిలో ముగ్గురు మహిళలు మరణించిన విషయం తెలిసిందే.ఈ ముగ్గురు మహిళల్లో ఓ మహిళ తల తెగిపడటంతో ఆ ప్రాంతంమంతి హాహాకారాలతో దద్దరిల్లిపోయింది.



ఇక ఈ దారుణ ఘటనలో మృతి చెందిన ముగ్గురిలో ఒకరు 44ఏళ్ల బ్రెజిలియన్ అనే మహిళ ఉన్నారు. ఆమె చర్చి నుంచి రెస్టారెంటుకు పరుగులు తీస్తున్న క్రమంలో దుండగుడు ఆమెపై కత్తితో దాడి చేయగా తీవ్రంగా గాయపడిన ఆమెకు ఆ సమయంలో తన పిల్లలు గుర్తుకొచ్చారు.ప్రాణాలు పోయే సయమంలో ఆమెకు పిల్లలు గుర్తుకు రావటం అమ్మతనానికి నిదర్శనం.




దుండగుడి దాడిలో తీవ్రంగా గాడయపడిన ఆమె తన పిల్లలపై ప్రేమతో ‘‘నేను వాళ్లను ఎంతగానో ప్రేమిస్తున్నానని నా పిల్లలకు చెప్పండి’’ అంటూనే ప్రాణాలు విడిచింది. ఈ విషయాన్ని స్థానిక మీడియా వెల్లడించింది.



కాగా..చర్చిలో జరిగిన దాడిపై స్పందించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌ మాట్లాడుతూ.. మతోన్మాద శక్తులను శక్తులను ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మాదేశం విలువలను విడిచిపెట్టదని అన్నారు. తీవ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.


కాగా ఓవైపు కరోనా దేశంలో విజృంబిస్తునన క్రమంలో..చర్చిలో జరిగిన ఈ ఘటనతో ఫ్రాన్స్ ప్రజలు వణికిపోతున్నారు. దేశంలో సెకండ్‌ వేవ్‌ మొదలైన క్రమంలో రెండో విడత లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే.ఫ్రాన్స్‌లోని నైస్‌ సిటీలోని నాట్రిడేమ్‌ చర్చిలో గురువారం (అక్టోబర్29,2020) గురువారం ఓ దుండగుడు దాడికి పాల్పడిన ఘటనలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.