France: ఫ్రాన్స్‌లో రాజకీయ అనిశ్చితి.. కొత్త ప్రధాని సెబాస్టియన్ రాజీనామా.. నెల రోజుల్లోనే రిజైన్.. కారణాలు ఇవే..
France : ఫ్రాన్స్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. కొత్త ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు.

Sebastian Lecornu
France New PM Sebastian Lecornu: ఫ్రాన్స్ లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. కొత్త ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించారు. సెప్టెంబర్ 9న ఆయన ఫ్రాన్స్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, ప్రధానిగా బాధ్యతలు చేపట్టి నెలరోజుల కాకముందే ఆయన రాజీనామా చేయడం గమనార్హం. ప్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ కు సెబాస్టియన్ అత్యంత సన్నిహితుడు. ఆదివారం ఇమాన్యుయేల్ మెక్రాన్ తో భేటీ తరువాత సెబాస్టియన్ రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే, తన రాజీనామాను అధ్యక్షు డు మాక్రాన్ వెంటనే ఆమోదించారు.
ఫ్రాన్స్ లో రాజకీయ అనిశ్చితి నెలకొంది. బడ్జెట్ సమస్యలు, యుక్రెయిన్ యుద్ధం, గాజా పరిస్థితి, అమెరికా అధ్యక్షుడి విధానాలతో ఏర్పడ్డ గందరగోళం కారణంగా ప్రాన్స్ అనేక సవాళ్లను ఎదుర్కొటుంది. ఆవే రాజకీయ అనిశ్చితికి దారితీశాయి. ప్రాన్స్‌లో రాజకీయ అనిశ్చితి వేళ ప్రధానమంత్రిగా నెల రోజుల కిందట సెబాస్టియన్ లెకోర్ను బాధ్యతలు చేపట్టారు. ఆయన బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఆయనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. బ్లాక్ ఎవ్రీతింగ్ పేరిట వేలాది మంది నిరసనకారులు పారిస్ తోపాటు దేశంలోని పలు ప్రధాన రహదారులను దిగ్భందించి ఆందోళనలు చేపట్టారు. బస్సులను దగ్దం చేయడంతోపాటు పలుప్రాంతాల్లో రైళ్లను నిలిపివేశారు.
Also Read: Hyderabad: హైదరాబాద్ భూముల వేలంలో సరికొత్త రికార్డు.. ఎకరం రూ.177 కోట్లు!.. ఏ ప్రాంతంలో అంటే..
సెబాస్టియన్ ఆదివారం కొత్త క్యాబినెట్ ను ఏర్పాటు చేయగా.. క్యాబినెట్ కూర్పుపై రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా మాజీ ఆర్థిక మంత్రి బ్రూనో రీ మైయిరోను రక్షణ మంత్రిగా నియమించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో పాటు గతంలో మంత్రులుగా చేసిన వారికి ఎక్కువగా అవకాశం ఇచ్చారు. దీంతో నియామకాలు జరిగిన కొన్ని గంటల్లోనే రాజీనామా సెబాస్టియన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తరువాత వెంటనే అధ్యక్షుడు మెక్రాన్ ఆయన రాజీనామాను ఆమోదించారు.
పాత ప్రధానమంత్రి ఫ్రాన్సువా బేరూను తొలగించి సెబాస్టియన్‌ను నియమించిన నెల రోజులకే ఆయన కూడా రాజీనామా చేశారు. ఇక ఫ్రాన్స్‌లో సెబాస్టియన్‌తో కలిపి రెండేళ్లలో ఐదుగురు ప్రధానులు రాజీనామా చేశారు. తాజాగా.. సెబాస్టియన్ లెకార్ను రాజీనామాతో ఫ్రాన్స్ రాజకీయాలు మరింత అనిశ్చితిలో పడ్డాయి. బార్డెల్లా జాతీయ అసెంబ్లీని రద్దు చేసి, కొత్త ఎన్నికలు ప్రకటించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌ను అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నారు. అయితే ఆయన ఇప్పటికిప్పుడు రాజీనామా చేసే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో మెక్రాన్ ఎవరిని తదుపరి ప్రధానమంత్రిగా నియమిస్తారనే విషయాలు ఉత్కంఠకు తెరలేపాయి.