Hyderabad: హైదరాబాద్ భూముల వేలంలో సరికొత్త రికార్డు.. ఎకరం రూ.177 కోట్లు!.. ఏ ప్రాంతంలో అంటే..
Hyderabad: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో భూముల ధరలు మరోసారి రికార్డ్ సృష్టించాయి. టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో ..

Hyderabad
Hyderabad: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో భూముల ధరలు మరోసారి రికార్డ్ సృష్టించాయి. టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో రాయదుర్గం ప్రాంతంలోని భూమి ఇండియాలోనే అత్యధిక ధర పలికింది. తద్వారా సరికొత్త రికార్డును హైదరాబాద్ (Hyderabad) క్రియేట్ చేసింది.
రాయదుర్గంలోని ప్రభుత్వ స్థలాన్ని సోమవారం టీజీఐఐసీ వేలం వేసింది. ఎకరా ధరను టీజీఐఐసీ రూ.101 కోట్లుగా ఫిక్స్ చేయగా.. ఈ వేలానికి అనూహ్య స్పందన వచ్చింది. ప్రముఖ కంపెనీలు వేలంలో ఆ స్థలాన్ని దక్కించుకునేందుకు పోటీ పడ్డాయి. వేలంలో పాల్గొన్న ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ రికార్డు ధరతో భూమిని దక్కించుకుంది. ఎకరాకు రూ.177 కోట్ల చొప్పున మొత్తం 7.6 ఎకరాల భూమిని రూ.1357 కోట్లకు సొంతం చేసుకుంది.
గతంలో హైదరాబాద్‌లోని కోకాపేటలో ఎకరం భూమి రూ.100 కోట్లు పలికి రికార్డు క్రియేట్ చేయగా.. ప్రస్తుతం రాయదుర్గంలోని ఎకరం భూమి రూ.177 కోట్లు పలికి సరికొత్త రికార్డును నమోదు చేసింది. మొత్తం 18.67 ఎకరాలకు వేలం
కాగా.. మరో 11 ఎకరాలకు వేలం నిర్వహించగా ఆ భూమిని రూ.1,556.5 కోట్లకు ప్రెస్టేజ్ రియల్ ఎస్టేట్ కంపెనీ దక్కించుకుంది. ఎకరా భూమిని రూ.141.5 కోట్లు చొప్పున వేలం పాటలో సొంతం చేసుకుంది.
హైదరాబాద్‌లో రాయదుర్గం భూములు ఆల్ టైం రికార్డుకు చేరుకున్నాయి. 2017లో రాయదుర్గం భూముల వేలంలో ఎకరానికి రూ.42.59 కోట్లు పలికింది. మొత్తం 2.84 ఎకరాల స్థలం వేలం వేశారు. 2022లో కోకాపేట నియో పోలీస్‌లో హెచ్ఎండిఏ నిర్వహించిన వేలంలో ఎకరానికి రూ.100.75 కోట్లు పలికింది. నియో పోలీస్ లో 3.60 ఎకరాల స్థలం వేలం వేశారు. 2025లో రాయదుర్గంలో ఎకరానికి రూ.177 కోట్లు పలికింది. టీజీఐఐసీ ఆధ్వర్యంలో మొత్తం 7.67 ెకరాలకు వేలం వేశారు.