టాటూ పిచ్చి ..అడ్డుగా ఉన్నాయని చెవులు కత్తిరించుకున్నాడు..తర్వాత ముక్కంట

  • Published By: madhu ,Published On : August 28, 2020 / 09:59 AM IST
టాటూ పిచ్చి ..అడ్డుగా ఉన్నాయని చెవులు కత్తిరించుకున్నాడు..తర్వాత ముక్కంట

Updated On : August 28, 2020 / 11:01 AM IST

టాటూ అంటే అతనికి ఎంతో ఇష్టం. శరీరంపై రకరకాలుగా టాటూ వేయించుకున్నాడు. కానీ..చెవులు అడ్డుగా వస్తున్నాయని అనుకున్నాడు. అంతే..ఠక్కున రెండు చెవులను కోసేసుకున్నాడు. జాగ్రత్తగా ఓ జాడీలో భద్రపరుకున్నాడు.



దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఒళ్లు గగురు పొడిచే విధంగా ఉన్నీ ఈ వీడియోను చూసి..గిదేం పిచ్చి అంటున్నారు. ఈ ఘటన బెర్లిన్ లో చోటు చేసుకుంది.

జర్మ‌నీకి చెందిన సాండ్రో టాటూ ప్రియుడు. త‌న శ‌రీరంపై ర‌క‌ర‌కాలుగా ప‌చ్చ‌బొట్టు వేయించుకున్నాడు. కానీ..ఇంక తృప్తి క‌ల‌గ‌లేదు. ఎక్కడో లోటు ఉన్నట్లు భావించేవాడు. శరీరాన్ని నచ్చిన రీతిలో మలుచుకొనేందుకు ఏకంగా..రూ. 5.85 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చు పెట్టాడు.



త‌ల‌పై స్పైక్స్‌( త్రికోణాక‌తులు) పెట్టించుకోవ‌డం, చేతిపై కొంత చ‌ర్మాన్ని డిజైన్ మేర‌కు తీసేయ‌డం, నాలుక‌ను రెండుగా చీల్చ‌డం.. ఇలా 17 సార్లు బాడీ మాడిఫికేష‌న్స్ చేయించుకున్నాడు. 2019లో ఏకంగా చెవులు కూడా క‌త్తిరించుకున్నాడు.
https://10tv.in/61-years-old-women-selling-4-dosha-olny-rs-10-in-agpur/
వాటిని ఓ జాడీలో భ్ర‌ద‌ప‌రిచాడు. దానికి సంబంధించిన వీడియోను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఒళ్లు గగుర్పొడుస్తోంది. దీనిపై అతను రెస్పాండ్ అయ్యాడు. న‌న్ను చూసి భ‌య‌ప‌డినా నేను లెక్క చేయ‌ను.



ఒక‌వేళ నా మొహం ప‌ట్టుకునే నేను జ‌బ్బున ప‌డ్డ ముస‌లివాడిలా క‌న్పిస్తున్నార‌ని చెప్పినా స‌రే వెనుకంజ వేయలేదు. నెక్స్ట్ త‌న‌ ముక్కు పైభాగాన్ని క‌త్తిరించే ప‌నిలో ప‌డ్డాడు.