AstraZeneca vaccine: వాడకాన్ని నిషేదించనున్న నాలుగు దేశాలు

జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ లు కూడా ఆస్ట్రాజెనెకా కొవిడ్ 19 వ్యాక్సిన్ వాడకాన్ని నిషేదించాయి. కొందరిలో అనారోగ్య సమస్యలు, మరికొందరిలో ప్రమాదకరంగా రక్తం గడ్డ కట్టడం వంటివి జరిగాయని చెప్తున్నారు. కంపెనీ, యూరోపియన్ రెగ్యూలేటర్స్ మాత్రం..

AstraZeneca vaccine: వాడకాన్ని నిషేదించనున్న నాలుగు దేశాలు

astrazeneca-vaccine

Updated On : March 16, 2021 / 1:48 PM IST

AstraZeneca Vaccine: జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ లు కూడా ఆస్ట్రాజెనెకా కొవిడ్ 19 వ్యాక్సిన్ వాడకాన్ని నిషేదించాయి. కొందరిలో అనారోగ్య సమస్యలు, మరికొందరిలో ప్రమాదకరంగా రక్తం గడ్డ కట్టడం వంటివి జరిగాయని చెప్తున్నారు. కంపెనీ, యూరోపియన్ రెగ్యూలేటర్స్ మాత్రం ఈ ఆరోపణలు నిరూపించడానికి ఎటువంటి సాక్ష్యాల్లేవని అంటున్నారు.

ఖండాంతరంగా వాడుతున్న మూడు వ్యాక్సిన్లలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఒకటి. యూరోపియన్ యూనియన్స్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా.. చాలా మంది ఈ వ్యాక్సిన్ డోస్ ను ఇచ్చారు. బ్రిటన్, యూఎస్‌లలో జరుగుతున్న ప్రచారం కారణంగా.. కొన్ని చోట్ల వ్యాక్సిన్ కొరత కూడా ఏర్పడింది. దీనిపై ఈయూ డ్రగ్ రెగ్యూలేటరీ ఏజెన్సీ గురువారం మీటింగ్ ఏర్పాటు చేయనుంది. అప్పుడే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ నిషేదించాలా వద్ద అనే నిర్ణయం తీసుకుంటామని అంటున్నారు.

జర్మనీ హెల్త్ మినిష్టర్.. ఆస్ట్రాజెనెకా షాట్స్ సస్పెండ్ చేయాలనే నిర్ణయించుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న ఏడుగురి బ్రెయిన్స్ లో బ్లడ్ క్లాట్స్ జరిగిన విషయంపై ఇన్వెస్టిగేషన్ చేపడుతున్నారు. ఈ రోజు తీసుకునే నిర్ణయం స్వచ్ఛమైన ముందస్తు జాగ్రత్త’ మాత్రమేనని జెన్స్ స్పాన్ అంటున్నారు.

ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయేల్ మాక్రోన్ మాట్లాడుతూ.. మంగళవారం మధ్యాహ్నం నాటికి వ్యాక్సిన్ షాట్స్ అన్నింటినీ సస్పెండ్ చేస్తామని చెప్పారు. ఇటలీ డ్రగ్ రెగ్యూలేటర్ దీనిని తాత్కాలికంగా నిషేదిస్తున్నామని దానిపై వివరణ వచ్చేంత వరకూ వ్యాక్సినేషన్ చేయమని చెప్పింది.