Women’s Day 2022: స్పెషల్ స్లైడ్స్‌తో..మహిళలకు గొప్పదనాన్ని చాటిచెప్పిన గూగుల్ డూడుల్
మహిళలకు గొప్పదనం చాటుచెబుతూ..స్పెషల్ స్లైడ్స్‌తో గూగుల్ డూడుల్ ప్రశంసలు తెలిపింది.

Google Doodle Celebrates International Womens Day 2022 With Animated Slides
International Women’s Day 2022 – Google Doodle : అంతర్జాతీయ మహిళా దినోత్సవం (March 8th) సందర్భంగా గూగుల్ ఓ ప్రత్యేకమైన డూడుల్‌ను రూపొందించింది. ఈరోజుల్లో మహిళల భాగస్వామ్యం లేని రంగం అంటూ ఏదీ లేదనే చెప్పాలి. రంగం ఏదైనా ప్రతిభమాదేననే ధైర్యం, స్థైర్యం మహిళలు పుణికిపుచ్చుకున్నారు. వంట ఇంటి గడప దాటి ఈరోజు అన్ని రంగాల్లోనే ప్రతిభను చాటుతున్నారు. వివిధ స్థానాల్లో ఉంటూ మహిళలు అందిస్తున్న విశేషమైన సేవలను యానిమేటెడ్ స్లైడ్స్ రూపంలో కళ్లకు కట్టింది గూగుల్.
Also read : International Women’s Day : భారత్-చైనా బోర్డర్ లో ఐటీబీపీ మహిళా జవాన్ల గస్తీ..
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (International Women’s Day) ప్రపంచం వ్యాప్తంగా జరుగుతోంది. ఈ సందర్భంగా టెక్ దిగ్గజం గూగుల్ (Google) తనదైన శైలిలో మహిళలకు సలామ్ చేస్తూ డూడుల్ (Google Doodle)ను రూపొందించింది. మహిళలు ఇంటిపనితో పాటు ఆఫీసు విధులను కూడా ఎలా సమన్వయంతో నిర్వర్తిస్తున్నారో చాటి చెప్పింది గూగులు డూడుల్. విభిన్న సంస్కృతుల్లో, పరిస్థితుల్లో నిత్యం మహిళలు చేస్తున్న సేవలను గుర్తు చేస్తూ యానిమేటెడ్ స్లైడ్ షోతో కూడిన డూడుల్‌లో రూపొందించింది. గృహిణుల నుంచి సైంటిస్టుల వరకు సమాజంలో వివిధ స్థానాల్లో ఉండి స్త్రీలు చేస్తున్న సేవలను గుర్తు చేసింది.
International Women’s Day Google Doodle యానిమేటెడ్ స్లైడ్‌లో ముందుగా.. ఓ అమ్మ ఇంట్లో ల్యాప్‌టాప్‌లో తన ఉద్యోగ విధులు నిర్వర్తిస్తూనే.. చంటిబిడ్డ బాధ్యతను కూడా చేస్తుంటుంది. చంటిబిడ్డను ఒడిలో వేసుకుని కంప్యూటర్ లో వర్క్ చేస్తోంది. ఆ పక్కనే ఉన్న పురుషుడు మాత్ర కులాసాగా తన పని తాను చేసుకుంటున్నాడు.
Also read : International Women’s Day: అంతర్జాతీయ మహిళా దినోత్సవం చరిత్ర.. మార్చి 8నే ఎప్పటి నుంచో తెలుసా
మహిళ మాత్రం తన ఇంటి బాధ్యతతో పాటు ఉద్యోగం బాధ్యతలను ఏకకాలంలో నిర్వర్తిస్తోంది. గూగుల్ డూడుల్ స్లైడ్‌లో. ఆ తరువాత స్టైడ్ లో హాస్పిటల్‌లో మహిళా డాక్టర్ సర్జరీ చేస్తుంటారు. ఇక ఓ స్త్రీ బైక్ మెకానిక్‌గా పని చేస్తూ చిన్నారికి నేర్పుతున్నట్టుగా ఉంది. సైంటిస్టుగా ప్రయోగాలు చేస్తూ, చెట్లకు నీరు పోస్తూ, ఫ్యాషన్ డిజైనర్‌గా సేవలు అందిస్తున్న మహిళలతో కూడిన స్లైడ్స్ ఉన్నాయి. ఓ స్త్రీ చెట్లకు నీరు పోస్తున్నట్టుగా.. ఇంకా సమాజంలో వివిధ స్థానాల్లో ఉంటూ సేవలు అందిస్తున్న మహిళల గురించిన స్లైడ్స్ ఉన్నాయి. యానిమేటెడ్ స్లైడ్స్‌తో కూడిన మహిళల దినోత్సవ గూగుల్ డూడుల్‌ను ఆర్ట్ డైరెక్టర్ తొక మయెర్ (Thoka Maer) రూపొందించారు.
ఇంటి నుంచి ఉద్యోగం చేస్తున్న తల్లి నుంచి మోటార్ సైకిల్ మెకానిక్‌గా తన బిడ్డకు కూడా నేర్పుతోంది. ఇలా పలు రంగాల్లో మహిళలు ఎలా రాణిస్తున్నారో..వారి భాగస్వామ్యం ఎంతగా ఉందో గూగుల్ డూడుల్‌లో చూపింది. గూగుల్ లో ఉన్న ప్రతీ స్లైడ్ పెయింటింగ్.. మహిళలు తమను తాము, ఉద్యోగాలను చూసుకుంటూ తమ కుటుంబాలకు, తమ వారికి ఎలా సేవలు అందిస్తున్నారో చూపుతున్నాయి. ఓర్పు, సహనం, పనితనం ఇలా అన్నీ మేళవింపులే మహిళలు. అటువంటి మహిళామణులకు హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే” అని గూగుల్ పేర్కొంది.