గూగుల్‌కే ఫైన్: ఫ్రాన్స్‌కు రూ.8వేల కోట్లు జరిమానా

ట్యాక్స్ కట్డడంలో మోసానికి పాల్పడిందంటూ ఫ్రాన్స్ ప్రభుత్వం గూగుల్‌పై కన్నెర్ర చేసింది. దీనిపై నాలుగేళ్లుగా జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. మొత్తానికి బిలియన్ యూరోలు అంటే దాదాపు రూ.8వేల కోట్ల వరకూ ఫ్రెంచ్ ప్రభుత్వానికి చెల్లించేందుకు గూగుల్ సిద్ధమైంది.
డబ్లిన్‌లో గూగుల్ యూరోపియన్ హెడ్ క్వార్టర్స్ వాళ్లు పన్నులు చెల్లించకుండా జాప్యం చేశారు. దేశంలో జరుగుతున్న కార్యకలాపాల మూలంగా లాభాలు పొందుతున్నారు కానీ, అసలు విషయం మర్చిపోయారు. ఐర్లాండ్ మొత్తంలో జరుగుతున్న అమ్మకాల పట్ల కొద్దిపాటి సొమ్మునే పన్ను కింద చెల్లిస్తుంది కానీ, మిగిలిన దానిని పట్టించుకోవడం లేదు.
ఈ విషయాన్ని పరిశీలించిన అధికారులు అంతర్జాతీయ పన్ను చట్టం ద్వారా డబ్లిన్ నుంచి నిర్వహిస్తున్న అన్ని కాంట్రాక్టు వివరాలను సేకరించారు. ఫలితంగా భారీ మొత్తంలో పన్ను ఉండడంతో ఎట్టకేలకు పారిస్ కోర్టులో ఇరు వర్గాల వాదనల తర్వాత రూ.7వేల 925కోట్లు చెల్లించేందుకు గూగుల్ ఒప్పుకుంది.