China: చైనాలో అకస్మాత్తుగా కుంగిపోయిన భూమి.. కార్మికులు గల్లంతు
బుధవారం రాత్రి 11గంటల సమయంలో దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని షెన్‌జెన్ సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది.

southern China Ground collapse
Construction Site Collapsed In Southern China: చైనాలో ఉన్నట్లుండి భూమి ఒక్కసారిగా కుంగిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది రైల్వే కార్మికులు గల్లంతయ్యారు. షెంజెన్ సిటీలో రైల్వే నిర్మాణ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భూమిలోకి కూరుకుపోయిన రైల్వే కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చైనా అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్తగా ప్రమాద స్థలానికి సమీపంలోని నివాసాలను అధికారులు ఖాళీ చేయించారు. స్థానిక ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.
Also Read: Bangladesh: బంగ్లాదేశ్‌లో ఉగ్రదాడులు జరిగే ముప్పు: యూకే
బుధవారం రాత్రి 11గంటల సమయంలో దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని షెన్‌జెన్ సిటీలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. భూమి కుంగిపోయిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే రైల్వే అధికారులు, రెస్క్యూ సిబ్బంది అక్కడి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అయితే, ఈ ప్రాంతంలో భూమి కుంగిపోవడానికి గల కారణాలపై అధికారులు విచారణ మొదలు పెట్టారు.
Update: 13 workers went missing following a sudden ground collapse that occurred at about 11 p.m. Wednesday at a railway construction site in Shenzhen.
Nearby residents have been evacuated. Temporary traffic control has been carried out around the site https://t.co/ROvJHpt5Ly pic.twitter.com/Yk3WUsHUoJ— China Xinhua News (@XHNews) December 5, 2024