Nigeria Bandits : నైజీరియాలో మారణహోమం.. 140 మందిని హతమార్చిన బందిపోట్లు

నైజీరియాలో ముష్కరులు మారణహోమం సృష్టించారు. ఈ వారం రోజుల్లో పలు చోట్ల జరిగిన దాడుల్లో కనీసం 140 మంది మరణించి ఉంటారని అంతర్జాతీయ మీడియా తెలిపింది. బందిపోట్ల దాడుల్లో హత్యకు గురైన..

Nigeria Bandits : నైజీరియాలో మారణహోమం.. 140 మందిని హతమార్చిన బందిపోట్లు

Nigeria Bandits

Updated On : January 8, 2022 / 11:28 PM IST

Nigeria Bandits : నైజీరియాలో ముష్కరులు మారణహోమం సృష్టించారు. ఈ వారం రోజుల్లో పలు చోట్ల జరిగిన దాడుల్లో కనీసం 140 మంది మరణించి ఉంటారని అంతర్జాతీయ మీడియా తెలిపింది. బందిపోట్ల దాడుల్లో హత్యకు గురైన 140 మందిని తాము పాతిపెట్టినట్లు జంఫారా రాష్ట్రంలోని బాధిత గ్రామానికి చెందిన ఒక సంఘం నాయకుడు బలరాబే అల్హాజీ తెలిపారు.

iPhone 12 Series : ఆపిల్ ఐఫోన్లపై భారీ తగ్గింపు.. రూ.10వేలు డిస్కౌంట్.. డోంట్ మిస్..!

బుధవారం నుండి గురువారం వరకు అంకా, బుక్కుయుమ్ జిల్లాల్లోని పది గ్రామాల్లో మోటారు బైక్‌లపై వచ్చిన వందలాది ముష్కరులు విధ్వంసానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. నివాసితులను కాల్చివేసి, దోపిడికి పాల్పడ్డారని, ఇళ్లను తగులబెట్టారని వాపోయారు. పది గ్రామాల పరిధిలో మరణించిన వారి మృతదేహాలను సేకరిస్తున్నామని, మృతుల సంఖ్య ఇంకా తేలలేదని స్థానికులు తెలిపారు.

WhatsApp Update : వాట్సాప్ ఫ్యూచర్ అప్‌డేట్.. చాట్ లిస్టులో ఈ రెండు ఆప్షన్లు ఎత్తేస్తోంది..!

మరోవైపు వాయువ్య, సెంట్రల్‌ నైజీరియాలో కొన్నేళ్లుగా క్రిమినల్‌ గ్యాంగ్‌లు చెలరేగిపోతున్నాయి. హింసాకాండ ఇటీవల మరింతగా పెరిగింది. కాగా, ఇలాంటి దారుణాలకు పాల్పడే బందిపోట్లను ఉగ్రవాదులుగా నైజీరియా ప్రభుత్వం ముద్ర వేసింది. ఈ మేరకు బుధవారం అధికారికంగా ప్రకటించింది.