Haiti : తీవ్ర భూకంపం, 304 మంది మృతి ?

హైతీలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి భారీ ప్రాణనష్టం సంభవించింది. ఇప్పటి వరకు 304 మంది చనిపోయి ఉంటారని అక్కడి ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Haiti : తీవ్ర భూకంపం, 304 మంది మృతి ?

Haiti

Updated On : August 15, 2021 / 6:22 AM IST

Haiti Earthquake: హైతీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.2 తీవ్రతగా నమోదైంది. భూకంపం ధాటికి భారీ ప్రాణనష్టం సంభవించింది. భూమి ప్రకంపనలకు భవనాలు పేక మేడలా కూలిపోయాయి. వృక్షాలు, కరెంటు స్తంభాలు కుప్పకూలడంతో భారీ ఆస్తినష్టం సంభవించింది. భయంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. ప్రాణాలు రక్షించుకోవడానికి తలో దిక్కుకు వెళ్లిపోయారు. అయినా…కొంతమంది ప్రాణాలు దక్కించుకోలేకపోయారు.

Read More : TTD : శ్రీవారి లడ్డూ కవర్‌‌లో వృక్ష ప్రసాదం, మట్టి కుండీలో పెట్టి నీళ్లు పోస్తే

మొత్తం ఈ భూకంప ధాటికి ఇప్పటి వరకు 304 మంది చనిపోయి ఉంటారని అక్కడి ప్రభుత్వం అంచనా వేస్తోంది. రాజధాని నగరం పోర్ట్ ఓ ప్రిన్స్ కు 125 కిలోమీటర్ల దూరంలో, దక్షిణ హైతీలోని సెయింట్ లూయిస్ డు సుడ్ కు 12 కి.మీటర్ల దూరంలో, 10 కి.మీటర్ల లోతులో కేంద్రీకృతం అయినట్లు ప్రభుత్వం తెలిపింది. పోర్ట్ ఓ ప్రిన్స్ తో పాటు సమీప ప్రదేశాల్లో తీవ్రమైన భూ ప్రకంపనాలు వచ్చాయి.
మొదట సునామీ హెచ్చరికలు జారీ చేసిన అనంతరం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. దేశంలోని పలు చోట్ల భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించినట్లు హైతీ కొత్త ప్రధాని ఏరియల్ హెన్రీ తెలిపారు. నెలరోజుల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు.

Read More : Sridevi : అతిలోక సుందరి ఆస్తుల విలువ ఎంతో తెలుసా

మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. భూ ప్రకంపనాల ధాటికి భవనాలు, ఇళ్లు పేకమేడలా కుప్పకూలిపోయాయి. అందులో ఉన్న వారు సమాధి అయిపోయారు. ప్రజలు భయాందోళనలతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఇక భూకంపానికి గాయపడిన క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు విపత్తు, సహాయ బృందాలు రంగంలోకి దిగాయి. వీరిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గతంలో కూడా భారీ భూకంపం సంభవించింది. 2010లో వచ్చిన ఈ భూకంప ధాటికి దాదాపు 2 లక్షలకు పైగానే చనిపోయారు. దాదాపు 3 లక్షల మంది క్షతగాత్రులయ్యారు.