China : భారీ పర్వతంపై పర్వతారోహకుల కోసం స్నాక్స్ స్టోర్ .. చూస్తే షాకవుతారు
చైనాలో కట్టడాలు అద్భుతంగా ఉంటాయి. ఓ భారీ పర్వతంపై పర్వతారోహకుల కోసం నిర్మించిన స్టాక్స్ స్టోర్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అసలు అక్కడికి ఎవరు వెళ్తారు? దానిని ఎవరు నిర్వహిస్తారు? అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

China
China : అక్కడ భారీ పర్వతాలు ఎక్కుతున్నప్పుడు ఆకలి వేసిందా? బాగా అలసిపోయారా? నో టెన్షన్. పర్వతంపై వేలాడుతూ ఓ స్టోర్ ఉంటుంది. అక్కడ ఆకలి తీర్చుకోవచ్చు. రిలాక్స్ అవ్వచ్చు. వామ్మో.. అదెక్కడ? ఆ నిర్మాణం ఎలా జరిగింది?
చైనాలో ప్రకృతి అద్భుతాలతో పాటు మానవ నిర్మిత భవనాలు అబ్బుర పరుస్తాయి. అవి అక్కడి ఇంజనీర్ల ప్రతిభకు అద్దం పడతాయి. అక్కడి ఓ భారీ పర్వతంపై వేలాడుతూ కనిపించే స్టాక్స్ స్టోర్ ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది. చిన్న చెక్క పెట్టెలా కనిపిస్తున్న ఆ స్టోర్ సకల సౌకర్యాలతో నిర్మించారట. ఆ స్టోర్ పర్వతారోహకులకు రిఫ్రెష్‌మెంట్ ఇస్తోంది. ప్రావిన్స్ పింగ్‌జియాంగ్ కౌంటీలోని షినియుజై నేషనల్ జియోలాజికల్ పార్క్‌లో పర్వతంపై ఈ స్టోర్‌ను 2018 లో ప్రారంభించారు. ఇక్కడ పనిచేసేవారు జిప్ లైన్‌లను ఉపయోగించి షాపు తెరుస్తారట. ఇంటర్నెట్‌లో ఈ స్టోర్‌కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. స్టోర్ ఎలా పనిచేస్తుంది? దానిని ఎవరు నిర్వహిస్తారు? తెలుసుకోవాలని నెటిజన్లు ఆసక్తి కనపరిచారు.
ప్రొఫెషనల్ రాక్ క్లైంబర్స్‌కి మాత్రమే ఈ స్టోర్‌లో ఉద్యోగం ఇస్తారట. వారు అమ్మే వస్తువులు అన్నీ ప్రత్యేక రోప్ కన్వేయర్ ద్వారా స్టోర్‌కి చేరవేస్తారట. ఆ స్టోర్‌లో ఒకరు మాత్రమే పట్టే స్పేస్ ఉంటుందట. @gunsnrosesgirl3 అనే ట్విట్టర్ యూజర్ ద్వారా షేర్ చేయబడిన ఫోటోలు చూసి ‘ఇక్కడ షాపింగ్ చేయాలంటే భయం వేస్తుందని’.. ‘ఇది చాలా వింతగాను.. నమ్మశక్యంగానూ లేదని’ నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
In the Hunan province in China, 120 metres (393 feet) up the side of a cliff
There is a shop
It supplies climbers with essential snacks, refreshments, and sustenance during their ascent. Workers replenish the store using ziplines, to offer a unique shopping experience with this… pic.twitter.com/ZmOnFzMOZO
— Science girl (@gunsnrosesgirl3) August 14, 2023