2020 న్యూ ఇయర్ : ఏ దేశంలో ఫస్ట్.. ఏ దేశంలో లాస్ట్ తెలుసా?

న్యూ ఇయర్ 2020 ఏడాదికి వెల్ కమ్ చెప్పేందుకు ప్రపంచ దేశాలన్నీ రెడీగా ఉన్నాయి. డిసెంబర్ 31 రోజు రాత్రి 12 గంటలకు మరి కొద్ది గంటలే సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే పలు దేశాల్లో న్యూ ఇయర్ జోష్ మొదలైంది. 2019 కి వీడ్కోలు పలికి.. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందుగా 2020లోకి అడుగుపెట్టిన ఐలాండ్ దేశాల్లో ఒసినీయా తొలి ఐలాండ్ దేశంగా అవతరించింది.
చిన్న పసిఫిక్ ఐలాండ్ దేశాల్లో టొంగా (tonga), సమోవా (samoa), కిరిబాటి (Kiribati) ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకున్నాయి. ఆ తర్వాత న్యూజిలాండ్ 2020లోకి అడుగుపెట్టిన రెండో దేశంగా నిలవగా, ఆస్ట్రేలియా, జపాన్, సౌత్ కొరియా కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టేశాయి. ఇక చివరిగా సెంట్రల్ పసిఫిక్ ఒసియన్‌లో ఉన్న బేకర్స్ ద్వీపంలో చివరిగా న్యూ ఇయర్ వేడుకలు జరుగనున్నాయి. అయితే, ఆ దేశ స్థానిక కాలమానం ప్రకారం.. న్యూ ఇయర్ ఏ దేశంలో ముందుగా వస్తుంది.. ఏ దేశంలో చివరగా వస్తుందో తెలుసుకుందాం..
భారత కాలమానం ప్రకారం.. డిసెంబర్ 31, మధ్యాహ్నం 3.30 గంటలకు ఐలాండ్ దేశాల్లో సమోవా, టొంగాతో పాటు క్రిస్మస్ ఐలాండ్/కిరిబాటిలో ముందుగా న్యూ ఇయర్ బెల్స్ మోగాయి. ఆ తర్వాత సమయానుగుణంగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే దేశాలెంటో ఓసారి చూద్దాం..
* మధ్యాహ్నం 3:45 గంటలకు చాతమ్ (Chatham) ఐలాండ్‌లో న్యూ ఇయర్ వస్తుంది.
* సాయంత్రం 4:30 గంటలకు న్యూజిలాండ్ 2020లోకి అడుగుపెడుతుంది.
* సాయంత్రం 5:30 గంటలకు రష్యా సంబంధిత భూభాగాల్లో న్యూ ఇయర్ వస్తుంది.
* సాయంత్రం 6:30 గంటలకు ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్, సిడ్నీ, కెన్ బెర్రా, హానియారాలో న్యూ ఇయర్ వస్తుంది.
* రాత్రి 7 గంటలకు అడిలైడ్, బ్రోకెన్ హిల్, సెడునా (Ceduna)లో కొత్త ఏడాది వస్తుంది.
* రాత్రి 7:30 గంటలకు బ్రెస్బేన్, పోర్ట్ మోర్సెబే, హగత్నా (Hagatna)లో న్యూ ఇయర్ ప్రారంభం.
* రాత్రి 8 గంటలకు డార్విన్, అలైస్ స్ర్పింగ్స్, టెన్నంట్ క్రీక్ లకు న్యూ ఇయర్ వస్తుంది.
* రాత్రి 8:30 గంటలకు జపాన్, టోక్యో, సౌత్ కొరియా, సీయోల్, ప్యాంగ్యాంగ్, దిలి (Dili), ఎన్గెరుల్ముడ్ (Ngerulmud)
* రాత్రి 9:30 గంటలకు చైనా, ఫిలిఫ్పైన్స్ లో న్యూ ఇయర్ ప్రారంభం అవుతుంది.
* రాత్రి 10:30 గంటలకు ఇండోనేషియా, థాయిలాండ్ 2020లోకి అడుగుపెడతాయి.
* రాత్రి 11 గంటలకు మయన్మార్ లో 2020 కొత్త ఏడాది ప్రారంభం అవుతుంది.
* రాత్రి 11:30 గంటలకు బంగ్లాదేశ్ 2020లోకి అడుగు పెడుతుంది.
* రాత్రి 11:45 గంటలకు నేపాల్‌లోని ఖాట్మాండు, పొక్హారా, బిరాత్ నగర్, ధరాన్ భూభాగాల్లో కొత్త ఏడాది వస్తుంది.
* రాత్రి 12:00 గంటలకు భారత్, శ్రీలంక దేశాల్లో 2020 కొత్త ఏడాది వస్తుంది.
* రాత్రి 12:30 (జనవరి 1) గంటలకు పాకిస్థాన్ 2020లోకి అడుగుపెడుతుంది.
* రాత్రి 1 గంటకు (జనవరి 1) అఫ్గానిస్థాన్ దేశంలో న్యూ ఇయర్ వేడుకలు మొదలవుతాయి. ఆ తర్వాత అజెర్ బాయిజన్, ఇరాన్, మాస్కో, గ్రీస్, జర్మనీ దేశాల్లో 2020 కొత్త ఏడాది ప్రారంభం అవుతుంది.
* తెల్లవారుజామున 5:30 గంటలకు (జనవరి 1) యూనైటెడ్ కింగ్ డమ్ (UK)లో కొత్త ఏడాదికి వెల్ కమ్ చెబుతారు. ఆ తర్వాత బ్రెజిల్, న్యూఫౌండ్ ల్యాండ్ కొత్త ఏడాదిలోకి అడుగుపెడతాయి.
* భారత కాలమానం ప్రకారం.. (జనవరి 1) ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటలకు కెనడాలో ముందుగా కొత్త సంవత్సరం వస్తుంది.. ఆ తర్వాత USAలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొదలవుతాయి.
* సాయంత్రం 5:50 గంటలకు (జనవరి 1) మార్క్యూసాస్ ద్వీపాలు, అమెరికన్ సమోవా ప్రాంతంలో చివరిగా న్యూ ఇయర్ మొదలువుతుంది. ఆ తర్వాత చిట్టచివరిగా బయటి ద్వీపమైన బేకర్ ఐలాండ్‌లో 2020 కొత్త ఏడాది ప్రారంభం అవుతుంది.