Happy New Year 2022 : మొదలైన కొత్త ఏడాది..బాణాసంచా వెలుగులతో సంబరాలు

స్కైటవర్ వద్ద బాణాసంచా కాలుస్తూ..సంబరాలు జరుపుకున్నారు. గతకాలపు జ్ఞాపకాలను మోసుకొంటూ.. రేపటి కలలు కంటూ.. నూతన ఏడాదికి ప్రపంచ దేశాలు ఒక్కొక్కటిగా తెర తీస్తున్నాయి‌...

Happy New Year 2022 : మొదలైన కొత్త ఏడాది..బాణాసంచా వెలుగులతో సంబరాలు

Happy

Updated On : December 31, 2021 / 5:18 PM IST

Happy New Year 2022 New zealand : కొత్త ఏడాది వచ్చేసింది. ఆ క్షణాల కోసం ఎంతో మంది ఆతృతగా ఎదురు చూశారు. 2022 సంవత్సరంలోకి ప్రజలు అడుగుపెట్టారు. భారతదేశం కంటే..కొన్ని ప్రాంతాలు కొత్త ఏడాది ముందుగానే వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్‌ వేడుకలు ప్రారంభమైయ్యాయి. మొదటిగా న్యూజిలాండ్ 2022కు ఆహ్వానం పలికింది. కొంగొత్త ఆశలతో 2022ని ప్రారంభించింది.

Read More : Ram Charan : 100 కోట్ల రెమ్యునరేషన్ నాకెవరిస్తారు?? : రామ్ చరణ్

గతకాలపు జ్ఞాపకాలను మోసుకొంటూ.. రేపటి కలలు కంటూ.. నూతన ఏడాదికి ప్రపంచ దేశాలు ఒక్కొక్కటిగా తెర తీస్తున్నాయి‌. 2021 ఇచ్చిన గుర్తుల్ని గుండెల్లో దాచుకొని.. సరైన దారుల్ని వెతుక్కొంటూ 2022లోకి ఎంట్రీ ఇచ్చారు‌. బాణాసంచా వెలుగులు, లేజర్‌ షోలతో న్యూజిలాండ్ వాసులు మొదటిగా కొత్త సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం పలికారు. బాణాసంచా వెలుగులు, లేజర్‌ షోలతో న్యూజిలాండ్ వాసులు కొత్త సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం పలికారు.

Read More : Ayodhya Ram Mandir: రామ మందిర నిర్మాణాన్ని ఇక ఎవరూ అడ్డుకోలేరు: హోంమంత్రి అమిత్ షా

స్కైటవర్ వద్ద బాణాసంచా కాలుస్తూ..సంబరాలు జరుపుకున్నారు. ఆస్ట్రేలియాలో అయిదున్నర గంటల ముందు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. జపాన్ కూడా మూడున్నర గంటల ముందే 2022లోకి అడుగుపెట్టారు. దక్షిణ కొరియా, ఉత్తర కొరియా దేశాలు కూడా కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికాయి.