Ram Charan : 100 కోట్ల రెమ్యునరేషన్ నాకెవరిస్తారు?? : రామ్ చరణ్

రామ్ చరణ్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఓ విలేఖరి మీరు నెక్స్ట్ సినిమాకి 100 కోట్ల పారితోషికం...........

Ram Charan : 100 కోట్ల రెమ్యునరేషన్ నాకెవరిస్తారు?? : రామ్ చరణ్

Ram Charan

Ram Charan :   తెలుగు, తమిళ్, హిందీ ఇలా అన్ని సినీ పరిశ్రమలు హీరోని ఆధారంగా చేసుకొని నడుస్తున్నవే. చాలా మంది చెప్పినట్టు హీరోలు ఉంటేనే సినిమాలకి జనాలు వస్తారు. సినిమాలకి కలెక్షన్స్ వస్తాయి. సినీ పరిశ్రమ మొత్తం హీరోల మీదే ఆధారపడి ఉంటుంది. దీంతో హీరోలకి డిమాండ్ బాగా పెరిగింది. ఒకప్పుడు హీరో కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటేనే గ్రేట్ అనుకునే వాళ్ళు. ఆ తర్వాత 10 కోట్లు తీసుకుంటే గ్రేట్ అన్నారు. కాని రాను రాను హీరోల రెమ్యునరేషన్ పెరగడంతో సినిమా బడ్జెట్ కూడా పెరిగిపోతుంది.

హాలీవుడ్ లో 100 కోట్ల రెమ్యునరేషన్ చాలా తక్కువ. బాలీవుడ్ లో హీరోల రెమ్యునరేషన్ 100 కోట్లకు దగ్గర్లో ఉంది. తెలుగు హీరోలు 30 నుంచి 40 కోట్ల రెమ్యునరేషన్ వరకు ఎదిగారు. రెమ్యునరేషన్ కి తగ్గట్టు హీరోలు కూడా సినిమాల కోసం అంతే రేంఙ్ లో కష్టపడతారు. ప్రస్తుత స్టార్ హీరోల్లో ఒకరైన రామ్ చరణ్ ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రాబోతున్నాడు. ఆ తర్వాత మెగాస్టార్ తో కలిసి ‘ఆచార్య’లోను కనిపించబోతున్నాడు. ఆ తర్వాత శంకర్ డైరెక్షన్ లో మరో భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాకి చరణ్ దాదాపు 100 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Cinema Ticket Rates : ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చిన్న సినిమాల‌ టికెట్ రేట్లు తగ్గుతాయి..

రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఓ విలేఖరి మీరు నెక్స్ట్ సినిమాకి 100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారంట అని అడగగా రామ్ చరణ్ నవ్వేసి అసలు వంద కోట్లు ఎక్కడున్నాయి? ఉన్నా నాకెవరు ఇస్తారు అంత రెమ్యునరేషన్? అని తిరిగి ప్రశ్నించారు. దీంతో అవన్నీ వట్టి పుకార్లేనని క్లారిటీ ఇచ్చాడు రామ్ చరణ్.