వెక్కి వెక్కి ఏడ్చిన కమలా హారిస్ మద్దతుదారులు

హోవార్డ్ యూనివర్సిటీలోని హాల్‌లో ఆమె మద్దతుదారులు తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు.

వెక్కి వెక్కి ఏడ్చిన కమలా హారిస్ మద్దతుదారులు

Updated On : November 6, 2024 / 12:59 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ఓటమి దిశగా పయనిస్తుండడంతో ఆమె మద్దతుదారులు వెక్కి వెక్కి ఏడ్చారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో సాధారణంగా ఇవాళ రాత్రి కమలా హారిస్ ప్రజలను ఉద్దేశించి వాషింగ్టన్‌ డీసీలోని

హోవార్డ్ యూనివర్సిటీలో ఎలక్షన్ నైట్ పార్టీలో మాట్లాడాల్సి ఉంది. అయితే, ఆమె ప్రసంగం ఉండబోదని హారిస్ ప్రచార కో-చైర్ సెడ్రిక్ రిచ్‌మండ్ తెలిపారు. ఆమె అర్ధరాత్రి దాటాక జాతిని ఉద్దేశించి మాట్లాడే ఉన్నట్లు తెలుస్తోంది.

కమలా హారిస్‌ ఓడిపోతుండడంతో హోవార్డ్ యూనివర్సిటీలోని హాల్‌లో ఆమె మద్దతుదారులు తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు. చాలా మంది కన్నీరు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపును ఉద్దేశిస్తూ డొనాల్డ్ ట్రంప్‌ ప్రసంగించారు ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఇది రెండోసారి.

Gold Price: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ బంగారం, వెండి ధరలు ఇలా..