ChatGPT: హార్వర్డ్ విశ్వవిద్యాలయం కీలక నిర్ణయం.. చాట్ జీపీటీ AI-ఆధారిత ఉపాధ్యాయుడిని నియమించేందుకు కసరత్తు
విద్యా ప్రయోజనాలకోసం అత్యాధునిక ఏఐ సాంకేతికతను ఉపయోగించుకోవటంలో హార్వర్డ్ యూనివర్శిటీ నిమగ్నమైంది. కంప్యూటర్ సైన్స్ కోర్సులో బోధకుడిగా ఏఐ చాల్‌బాట్‌ను నియమించనుంది.

ChatGPT
Harvard University: చాట్‌జీపీటీ వంటి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఐటీ రంగాన్నే కాదు.. ఉపాధ్యాయ రంగాన్నిసైతం మింగేస్తుందా? ఉపాధ్యాయుల స్థానంలో ఏఐ ఆధారిత ఉపాధ్యాయులు త్వరలో రానున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇందులో భాగంగా విద్యా ప్రయోజనాలకోసం అత్యాధునిక ఏఐ సాంకేతికతను ఉపయోగించుకోవటంలో హార్వర్డ్ యూనివర్శిటీ నిమగ్నమైంది. ఈ క్రమంలో విశ్వవిద్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ ఆధారిత ఉపాధ్యాయుడిని నియమించాలని యోచిస్తోంది. విశ్వవిద్యాలయం తన కంప్యూటర్ సైన్స్ కోర్సులో బోధకుడిగా ఏఐ చాల్‌బాట్‌ను నియమించనుంది. సెప్టెంబర్ నుంచి ఏఐ కోర్సు విద్యార్థులకు అందుబాటులోకి సైతం వస్తుందని తెలుస్తోంది.
ఓపెన్ఏఐ అడ్వాన్స్డ్ 3.5, జీపీటీ 4 మోడల్స్ ఆధారంగా అభివృద్ధి చేసిన ఏఐ టీచర్ సేవలను యూనివర్శిటీ వినియోగించుకోనుంది. ఈ విషయంపై విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డేవిడ్ మలన్ మాట్లాడుతూ.. ఏఐ ద్వారా ఈ ఏడాది చివరి నాటికి కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఏఐ టీచర్ ద్వారా తాము టీచర్, విద్యార్థి నిష్పత్తిని 1:1 సాధించగలమని భావిస్తున్నట్లు చెప్పారు. ఇదిలాఉంటే యూనివర్శిటీ గత ఏడాది నవంబర్ లో ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్ జీపీటీని ఓపెన్ఏఐ లాంఛ్ చేసింది. చాట్ జీపీటీకి టెక్ ప్రపంచంలో విశేష ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో హార్వర్డ్ యూనివర్శిటీ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.