Hawk attacks Chicken: కోడిపై కన్నేసిన గద్ధ.. సీన్ చివర్లో సూపర్ ట్విస్ట్

కోడిపై కన్నేసి క్షణాల వ్యవధిలో నేలకు దిగి పట్టుకుపోవాలని ప్రయత్నించిన డేగకు షాక్ ఇచ్చింది మేక. 40లక్షల మంది చూసిన ఈ వీడియోలో సంగతేంటంటే..

Hawk attacks Chicken: కోడిపై కన్నేసిన గద్ధ.. సీన్ చివర్లో సూపర్ ట్విస్ట్

Chicken Goat

Updated On : September 17, 2021 / 10:47 PM IST

Hawk attacks Chicken: ఎప్పుడూ వెన్నంటి ఉండి కలిసి తిరిగి వాడే కాదు. కష్టాల్లో ఉన్నప్పుడూ కాపాడేవాడే స్నేహితుడంటే. పశువులు.. పక్షులు అనే తేడా లేనే లేదు.. సాయం అందించే ప్రతి తోడూ స్నేహబంధమే. రీసెంట్ గా జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. కోడిపై కన్నేసి క్షణాల వ్యవధిలో నేలకు దిగి పట్టుకుపోవాలని ప్రయత్నించిన డేగకు షాక్ ఇచ్చింది మేక.

40లక్షల మంది చూసిన ఈ వీడియోలో సంగతేంటంటే.. కోళ్ల ఫామ్ లో తిరుగుతున్న కోడిని పట్టుకోవాలని డేగ ప్రయత్నించింది. నేలపైకి దిగుతుండగానే అలర్ట్ అయిన కోడి అరుస్తూ పరుగులు పెట్టింది. అది చూసి సెకన్ల వ్యవధిలో కుక్క అక్కడకు వచ్చి కాపాడే ప్రయత్నం చేసిన డేగ వేగానికి ఓడిపోయే పరిస్థితి కనిపించింది.

 

 

కాస్త దూరంలో ఉండి గమనించిన మేక వచ్చి కోడిని, కుక్కను గెలిపించి గద్ధను తరిమికొట్టింది. ముందుగా వచ్చిన కుక్క, చివర్లో వచ్చిన మేక కోడి ప్రాణాలు కాపాడగలిగాయి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నారు. జంతువుల్లో కూడా ఇలాంటి ఎమోషన్స్ ఉంటాయా అని అడుగుతుంటే స్నేహం కోసం ఎంత పనిచేశాయని మరొకరు కామెంట్లు చేస్తున్నారు.

 

Software Engineer : రెండేళ్ల కొడుకును గొంతుకోసి చంపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్