Helicopter Crashes: చూస్తుండగానే బీచ్ లో కుప్పకూలిన హెలికాప్టర్
ప్రజలు చూస్తుండగానే ఒక హెలికాప్టర్ అమాంతం సముద్రం ఒడ్డున కుప్పకూలిన అమెరికాలోని మియామీ నగరంలో చోటుచేసుకుంది.

Helicopter
Helicopter Crashes: ప్రజలు చూస్తుండగానే ఒక హెలికాప్టర్ అమాంతం సముద్రం ఒడ్డున కుప్పకూలిన అమెరికాలోని మియామీ నగరంలో చోటుచేసుకుంది. మియామీ నగరంలోని సౌత్ బీచ్ లో శనివారం ప్రజలు సేదదీరుతున్న సమయంలో..ఆకాశంలో అదుపుతప్పిన ఓ హెలికాప్టర్ ఒక్కసారిగా బీచ్ ఒడ్డు నుంచి పది మీటర్ల దూరంలో సముద్రంలో కుప్పకూలింది. హెలికాప్టర్ కూలిన ప్రాంతంలో అక్కడ మనుషులెవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించిన స్థానికులు..వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడగా వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Also read: Freedom Convoy: కెనడాలో మరింత సంక్లిష్టంగా “ఫ్రీడమ్ కాన్వాయ్” నిరసనలు: అడ్డుకున్న పోలీసులు
ఘటనపై సమాచారం అందుకున్న సౌత్ బీచ్ పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సాంకేతిక కారణాలతోనే హెలికాప్టర్ కూలినట్లు ప్రాధమికంగా అంచనా వేశారు. కుప్పకూలిన హెలికాప్టర్ రాబిన్సన్ R44గా గుర్తించారు. ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అధికారులు, జాతీయ రవాణా భద్రతా బోర్డు అధికారులు విచారణ చేపట్టనున్నారు. హెలికాప్టర్ కుప్పకూలుతున్న దృశ్యాలను స్థానికులు తమ సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. కొందరు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అయ్యాయి. ఇదిలాఉంటే శనివారం నాడు అమెరికాలోని న్యూపోర్ట్ బీచ్ లోనూ ఇదే తరహా హెలికాప్టర్ ప్రమాదం సంభవించింది. పోలీస్ గస్తీ హెలికాప్టర్ కుప్పకూలినట్లు న్యూపోర్ట్ పోలీసులు వెల్లడించారు.
Whoa: A helicopter crashed into the ocean by Miami’s South Beach in front of swimmers
Two people inside the chopper have been hospitalized https://t.co/ABdwCdr61j
— philip lewis (@Phil_Lewis_) February 19, 2022
Also read: Chambal River : రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. చంబల్ నదిలో పడ్డ కారు, 9 మంది దుర్మరణం