US, Allies: ఉగ్రదాడి జరగొచ్చు.. ప్రాణాలు పోతాయ్.. వెళ్లిపోండి

అఫ్ఘానిస్తాన్ విమానాశ్రయం బయట ఉన్న తమ పౌరులను వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని కోరింది అమెరికా.

US, Allies: ఉగ్రదాడి జరగొచ్చు.. ప్రాణాలు పోతాయ్.. వెళ్లిపోండి

Afghans Kabul

Updated On : August 26, 2021 / 12:35 PM IST

Afghans and foreigners: అఫ్ఘానిస్తాన్ విమానాశ్రయం బయట ఉన్న తమ పౌరులను వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని కోరింది అమెరికా. విమానాశ్రయం బయట నిలబడి ఉన్న అమెరికన్లపై ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని అమెరికా భయపడుతోంది. అందుకే అమెరికా విదేశాంగ శాఖ అఫ్ఘనిస్తాన్‌లో ఉన్న తమ పౌరులను హెచ్చరించింది. కాబూల్‌లో విమానాశ్రయం అబ్బే గేట్, ఈస్ట్ గేట్ మరియు నార్త్ గేట్ వద్ద ఉన్నవారు వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచింయింది. విమానాశ్రయంపై ఉగ్రవాదులు దాడి చేయొచ్చని అమెరికా ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేయగా.. ఈ క్రమంలోనే అమెరికా హెచ్చరికలు జారీ చేసింది.

కాబూల్ విమానాశ్రయ భద్రతను పూర్తిగా యుఎస్ మిలిటరీ స్వాధీనం చేసుకుంది. ఆగస్టు 15న తాలిబాన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత, దేశం విడిచిపెట్టిన ప్రజలు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి వస్తున్నారు. దీని కారణంగా, అక్కడికి వస్తున్న రెస్క్యూ విమానాలు ల్యాండింగ్ మరియు ఫ్లైయింగ్‌లో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. ఈ గందరగోళం కారణంగా, విమానాశ్రయం నుంచి విమానాల కదలిక కొంతకాలం ఆపివేశారు అధికారులు.

కొన్ని ఫుటేజ్‌లలో అమెరికా విమానం గాలిలోకి వెళ్లిన తర్వాత.. కొంతమంది పడిపోవడం కూడా గమనించారు. ఈ గందరగోళాన్ని ఆపడానికి, అమెరికన్ సైనికులు కూడా తగు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అమెరికన్ సైనికుల భద్రతకు కూడా ముప్పు వాటిల్లింది. వెంటనే అప్రమత్తమైన అమెరికా ఈ విమానాశ్రయ భద్రతను తన చేతుల్లోకి తీసుకుంది. అయితే, అమెరికా మాత్రమే కాదు.. ఇతర దేశాల ప్రజలు కూడా విమానాశ్రయం బయట ఉన్నారు.