Hindu Temple: పాకిస్తాన్‌లో ధ్వంసమైన హిందూ దేవాలయం

పాకిస్తాన్‌లోని కరాచీలో హిందూ దేవాలయాన్ని ధ్వంచం చేశారు. రాంచోర్ లైన్ ఏరియాలోని ఈ ఘటనకు కారణమైన వ్యక్తిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. హిందూ దేవతా విగ్రహమైన జగ్ మయాను సుత్తితో

Hindu Temple: పాకిస్తాన్‌లో ధ్వంసమైన హిందూ దేవాలయం

Pakistan Temple

Updated On : December 21, 2021 / 10:17 AM IST

Hindu Temple: పాకిస్తాన్‌లోని కరాచీలో హిందూ దేవాలయాన్ని ధ్వంచం చేశారు. రాంచోర్ లైన్ ఏరియాలోని ఈ ఘటనకు కారణమైన వ్యక్తిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. హిందూ దేవతా విగ్రహమైన జగ్ మయాను సుత్తితో కొట్టి ధ్వంసం చేసినట్లు పాకిస్తాన్ ఉర్దూ మీడియా సమా టీవీ టెలికాస్ట్ చేసింది. స్థానికులు నిందితుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

భారతీయ జనతా పార్టీ లీడర్ మజిందర్ సింగ్ సిర్సా ఘటనను ఖండిస్తూ కామెంట్లు చేశారు. మైనారిటీలపై ఉద్దేశ్యపూర్వకంగానే దాడి జరిగిందని ఆరోపించారు. అదే ఏరియాలోని మరో హిందూ దేవాలయం ధ్వంసం చేసి ఇది అంత విలువైనది కాదని దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందంటూ సిర్సా ట్వీట్ చేశారు.

అక్టోబరు నెలారంభంలో సింధ్ ప్రాంతంలోని హనుమాన్ దేవీ మాతా మందిర్ లో గుర్తు తెలియని దొంగలు చొరబడి.. నగలు, వేల రూపాయలను దోచుకెళ్లారు. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ లోని మైనారిటీలైన మతస్థులపై దాడులు సాధారణంగా మారాయి.

………………………….. అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం