Gal Gadot :షూటింగ్ బిజీలోకూడా బిడ్డకు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడానికి ఆ హీరోయిన్..

షూటింగ్ బిజీలో కూడా ఓ సూపర్ హీరోయిన్ బిడ్డకు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడానికి.. చేసిన పనితో ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి. వండ‌ర్ వూ-మామ్ అంటూ..

Gal Gadot :షూటింగ్ బిజీలోకూడా బిడ్డకు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడానికి ఆ హీరోయిన్..

Hollywood Heroine Gal Gadots Pics Of Pumping Breast Milk (1)

Updated On : August 19, 2021 / 6:08 PM IST

Hollywood heroine Gal gadots pics of pumping breast milk : ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా..ఏ స్థాయికి వెళ్లినా అమ్మ అమ్మే. ఎంత పెద్ద హీరోయిన్ అయినా బిడ్డకు ఏ సమాయానికి ఏది కావాలో..బిడ్డకు ఎప్పుడు ఆకలి వేస్తుందో..అనే ఆలోచనే ఉంటుంది తల్లి. అది మరోసారి నిరూపించబడింది. వండ‌ర్ వుమ‌న్ సినిమాలో అందరిని స్టన్ చేసిన ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ గాల్ గాడ‌ట్ ద్వారా. షూటింగ్ బిజీలో కూడా గాల్ గాడ‌ట్ తన పసిబిడ్డ గుర్తుకొచ్చింది. చిన్నారి చిట్టితల్లి ఆకలి వేసి ఏడుస్తోందేమో అని గుండెల్లో తలంపు పుట్టింది హీరోయిన్ గాల్ గాడ‌ట్. అంతే గుండెల్లోంచి పాల సముద్రం ఎగసిపడింది. పాలతో రొమ్ములు బరువెక్కాయి. పాల ధార జలపాతంలా కురిసింది.

Hollywood Heroine Gal Gadots Pics Of Pumping Breast Milk (2)

షూటింగ్ కోసం ప్రిపేర‌వుతున్న స‌మ‌యంలో..ఓ పక్క మేకప్ వేయించుకుంటూనే గాల్ గాడ‌ట్ కు ఇటీవ‌ల పుట్టిన త‌న మూడ‌వ కూతురికి బ్రెస్ట్ మిల్క్ ఇచ్చేందుకు చ‌నుబాల‌ను బాటిల్ లోకి పంప్ చేసారు. సింది. ఆ సంఘ‌ట‌న‌కు సంబంధించిన ఫోటోను ఆమె త‌న ఇన్‌స్టాలో పోస్టు చేసారామె. మేక‌ప్ వేసుకుంటున్న స‌మ‌యంలో ఓ బాటిల్‌లో చ‌నుబాల‌ను పంప్ చేసింది. స‌మ‌యాన్ని వృధా చేయ‌కుండా.. త‌న కూతురి కోసం ముందే బాటిల్‌లోకి బ్రెస్ట్ మిల్క్‌ను పంప్ చేయ‌డం అంద‌ర్నీ కట్టిపడేసారామె. ఎంతైనా అమ్మకదా..చిట్టితల్లి బుల్లిబొజ్జ గుర్తుకొచ్చిందామెకు. తెరవెనుక‌ ఓ త‌ల్లిలా అంటూ త‌న ఫోటోకు ఆమె చేసిన కామెంట్ అభిమానుల్ని ఆలోచింప చేసారు గాల్ గాడట్.

Hollywood Heroine Gal Gadots Pics Of Pumping Breast Milk (3)

ఆ ఫోటోకు లైక్‌లు, ప్ర‌శంస‌లు వెల్లువెత్తాయి. ఇజ్రాయిలీ న‌టులంతా హార్ట్ ఐకాన్‌ల‌తో గాల్‌ను మెచ్చుకున్నారు. సూప‌ర్‌మామ్‌, గ్రేట్ మామ్ అంటూ అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఆమె అభిమానులే కాదు యాత్ర మహిళా లోకం ఆ ఘటన చూసి అమ్మంటే అంతేమరి అంటున్నారు.

Gal Gadot announces role of Cleopatra, draws complaints of error | FR24  News English

ఇక ఓ యూజ‌ర్ అయితే.. వండ‌ర్ వూ-మామ్ అంటూ కామెంట్ చేశాడు. 2008లో పెళ్లి చేసుకున్న వండ‌ర్ వుమ‌న్ హీరోయిన్ గాల్ గాడ‌ట్‌కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ప్ర‌స్తుతం డెత్ ఆన్ ద నైల్‌, రెడ్ నోటీస్ లాంటి చిత్రాల్లో న‌టిస్తున్నారు గాల్ గాడట్. వండ‌ర్ వుమ‌న్ ఫిల్మ్‌లో త‌న న‌ట‌న‌తో అంద‌ర్నీ స్ట‌న్ చేసిన ఈ సూపర్ ఉమెన్ ఇప్పుడు ఈ ఒక్క ఫోటోతో సూపర్ మామ్ క్రెడిట్ కొట్టేశారు. త‌న మాతృ ప్రేమ‌ను ప్ర‌ద‌ర్శిస్తూ.. అభిమానుల గుండెల్ని గెలిచేసిందీ స్టార్‌. వండ‌ర్ వు-మామ్‌, సూప‌ర్‌మామ్ అంటూ ఆమె ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాతో ఆ హీరోయిన్‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.