Brazil Landslide : కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి.. 32 మందికి గాయాలు.. వీడియో

సరస్సులో టూరిస్టులతో వెళ్తున్న బోటుపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందారు. 23 మంది గల్లంతైనట్లు సమాచారం

Brazil Landslide : కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి.. 32 మందికి గాయాలు.. వీడియో

Brazil Landslide

Updated On : March 16, 2022 / 10:20 AM IST

Brazil Landslide : విహార యాత్ర తీవ్ర విషాదాన్ని నింపింది. హాయిగా సరస్సులో బోటింగ్ చేస్తున్న సమయంలో కొండ చరియలు విరిగి పర్యాటకులపై పడటంతో ఏడుగురు మృతి చెందగా తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే మరో 20 మంది తప్పిపోయారు. కాగా ఈ దుర్ఘటన బ్రెజిల్‌లో జరిగింది. శనివారం ఆగ్నేయ బ్రెజిల్‌లోనిమినాస్ గెరైస్ రాష్ట్రంలోని కాపిటోలియో వద్ద ఉన్న సరస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక పెద్ద పర్వతం లోయ గోడ ఒక్కసారిగా పడవలపై పడింది.

చదవండి : Brazil : ఆసుపత్రిలో చెంచాను మైక్‌గా పట్టుకుని పాట పాడిన బుడ్డోడు

ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ప్రమాద సమయంలో నదిలో పదికిపైగా పడవలు ఉన్నాయి. మూడు బోట్లపై కొండచరియలు విరిగిపడినట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే మొదట కొండ నుంచి చిన్న రాళ్ళూ కిందపడ్డాయి. క్షణాల వ్యవధిలో భారీ రాతికొండ సరస్సులో కూలిపోయింది. ఇక ఈ ఘటనలో మరో 23 మంది స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికార వర్గాలు తెలిపాయి.

చదవండి : Brazilian : ఆ పాము ‘విషం’తో కరోనాను అంతం చేయొచ్చా ?