Brazilian : ఆ పాము ‘విషం’తో కరోనాను అంతం చేయొచ్చా ?

ఓ పాము విషంతో కరోనాకు చెక్ పెట్టొచ్చని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Brazilian : ఆ పాము ‘విషం’తో కరోనాను అంతం చేయొచ్చా ?

Snake

Jararacussu : కరోనా వైరస్ ఇంకా అంతం కావడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. భారతదేశంలో ప్రతి రోజు చాలా మంది వైరస్ బారిన పడుతున్నారు. కరోనాకు చెక్ పెట్టేందుకు పలు కంపెనీలు వ్యాక్సిన్ లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.

Read More : Covid-19 Vaccine: కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్ సరికొత్త రికార్డు..!

కరోనా అంతం కావాలంటే..వ్యాక్సినేషనే కాకుండా..ఇతర పదార్థాలు కూడా ఉపయోగపడుతాయని పలువురు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా..ఓ పాము విషంతో కరోనాకు చెక్ పెట్టొచ్చని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Read More : భారత్‏కు టెస్లా కార్లు .. ఎలన్ మస్క్ రిప్లై ఇదే!

బ్రెజిల్ అడవుల్లో ఎన్నో పాములు కనిపిస్తుంటాయి. అందులో జరారాకుసో (Jararacussu pit viper) ఒకటి. దీనికి చెందిన విషంతో కరోనాను అంతం చేయొచ్చని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. దీనిపై ఓ అధ్యయనం జరిగింది. ఈ నివేదికను సైంటిఫిక్ జర్నల్ మాలిక్యూల్ లో ప్రచురించారు.

Read More : Hyderabad : ఓఆర్‌ఆర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఎంపీటీసీ, ఆమె భర్త మృతి

జరారాకుసో విషంలో ఉండే అణువులు, కోవిడ్ వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటాయని, ఆ సర్ప విష అణువులు కోతుల్లో 75 శాతం కరోనా వైరస్ కణాల వృద్ధిని నియంత్రిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి సంబంధించిన విషంలో అణువులు కీలక కానున్నట్లు భావిస్తున్నారు. పెపైటైడ్ అణువులను ల్యాబ్ ల్లో అభివృద్ధి చేయవచ్చని సావో పౌలో యూనివర్సిటీ ప్రొఫెసర్ రాఫేల్ గైడో తెలిపారు.

Read More : Sachin Pilot : త్వరలో రాజస్థాన్ కేబినెట్ విస్తరణ.. గెహ్లాట్ మంత్రివర్గంలోకి పైల‌ట్‌..!

బ్రెజిల్ లో కనిపించే అతిపెద్ద సర్పంగా జరారాకుసోకు చాలా గుర్తింపు ఉంది. ఈ పాములు రెండు మీటర్ల పొడుగు ఉంటాయి. అట్లాంటిక్ తీర ప్రాంతం, బొలివియా, అర్జెంటినా, పరాగ్వే దేశాల్లో ఈ సర్పాలు సంచరిస్తుంటాయి. మరి ప్రస్తుతం జరుగుతున్న అధ్యయనాలు చివరకు ఏం తెలుస్తాయో చూడాలి.