కరోనా వైరస్ రోగులకు రోబోలతో ఫుడ్, మెడిసిన్స్ డెలివరీ: సేఫ్టీ ఐడియా

  • Published By: veegamteam ,Published On : February 10, 2020 / 06:09 AM IST
కరోనా వైరస్ రోగులకు రోబోలతో ఫుడ్, మెడిసిన్స్ డెలివరీ: సేఫ్టీ ఐడియా

Updated On : February 10, 2020 / 6:09 AM IST

కరోనా వైరస్ చైనాను అల్లకల్లోలం చేసేస్తోంది. హాస్పిటల్స్ అన్నీ కరోనా రోగులతోను..కరోనా సోకిందనే అనుమానితులతోను నిండిపోతున్నాయి. కరోనా బాధితులకు డాక్టర్లు, నర్సులు తమ ప్రాణాలకు పణ్ణంగా పెట్టి వైద్యం చేస్తున్నారు. సేవలు చేస్తున్నారు. 

ఈ క్రమంలో చైనాలోని నాన్జింగ్ హాస్పిటల్స్‌లో కరోనా సోకిన రోగులకు ఆహారం పెట్టటానికి రోబోలను వినియోగిస్తున్నారు. రోబోల ద్వారా కరోనా రోగులకు మందులు..ఆహారం..వాటర్ వంటివి అందించటానికి రోబోలను వినియోగిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ట్విట్లర్ లో పోస్ట్ చేశాడు ఓ యూజర్. 

కరోనా రోగులకు ఆహారం,..మెడిసిన్స్ అందించే రోబోలు ఏదో సాధారణమైన యంత్రంలా కాకుండా..రోబో ముఖాలను చక్కటి చిరునవ్వుతో కూడిన స్నేహపూర్వకమైన ముఖాలను రూపొందించారు. దీనిపై నెటిజన్లు చక్కగా స్పందిస్తూ..‘‘నైస్ ఐడియా అంటూ ప్రశంసిస్తున్నారు. మరో యూజన్ కరోనా వైరస్ ను అరికట్టటానికి డాక్టర్లు..నర్సులు చేస్తున్న సేవల్లో రోబోలు కూడా పాలు పంచుకోవటం చాలా సంతోషమని తెలిపారు.  కాగా చైనాలో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి 811మందికిపైగా మృతి చెందారు. ఎంతోమంది కరోనా అనుమానితులు హాస్పిటల్ లో చికిత్సపొందుతున్నారు.