ట్రంప్ కు మిలటరీ అధికారాలు తగ్గిస్తూ…పార్లమెంట్ లో ఓటింగ్

  • Published By: venkaiahnaidu ,Published On : January 6, 2020 / 12:42 PM IST
ట్రంప్ కు మిలటరీ అధికారాలు తగ్గిస్తూ…పార్లమెంట్ లో ఓటింగ్

Updated On : January 6, 2020 / 12:42 PM IST

టాప్ ఇరానియన్ మిలటరీ కమాండర్ ఖాసిమ్ సొలేమ‌నిని అమెరికా ద‌ళాలు చంపేయడంతో ఇరాన్-అమెరికా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఏ క్షణంలో యుద్ధం వస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. అమెరికాపై పగ తీర్చుకుంటామని ఇరాన్ చెబుతోంది. తమ కమాండర్‌ని చంపినందుకు పగ తీర్చుకుంటామని చెప్పిన ఇరాన్..అందుకు తగ్గట్లే అడుగులు కూడా వేస్తోంది.ట్రంప్‌ను హతమార్చిన వారు రూ. 80 మిలియన్ డాలర్లు (రూ. 570 కోట్లు) గెలుచుకోవచ్చని ఇరాన్ అధికారిక ఛానల్ ప్రకటన చేయడం సంచలనం సృష్టిస్తోంది.

చరిత్రలో మొట్టమొదటిసారిగా జంకారా మసీద్ డోమ్‌పై రెడ్ ఫ్లాగ్‌ని ఇరాన్ ఎగరవేసింది..ఇది విప్లవానికి మాత్రమే కాదు..చైతన్యానికి కూడా సంకేతంగా చూస్తారు..కానీ మసీద్ పై భాగంలో ఎర్రజెండా ఎగరవేయడమనేది..యుద్ధానికి కూడా సంకేతంగా చెప్తారు..అంటే ఇక ఇరాన్ అమెరికాపై తాడో పేడో తేల్చేందుకు డిసైడైనట్లు కన్పిస్తోంది. అటు అమెరికా కూడా ఇరాన్ కు గట్టిగానే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇరాన్ తమపై దాడికి పాల్పడితే..మాత్రం..మునుపెన్నడు లేనిస్థాయిలో ప్రతికారం తీర్చుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. 21వ శతాబ్దంలో మొదటి.. మొత్తంగా చూస్తే.. మూడో ప్రపంచ యుద్ధానికి కౌంట్ డౌన్ ప్రారంభమైనట్లు కన్పిస్తోంది. 

ఈ సమయంలో అమెరికా పార్లమెంట్ స్పీకర్ నాన్సీ పెలోకీ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ కు సంబంధించి మిలటరీ చర్యలలో అధ్యక్షుడు ట్రంప్ కు ఉన్న అధికారాలను తగ్గించే విధంగా యుద్ధ అధికారాల తీర్మాణాన్ని హౌస్ ప్రతినిధులు ఈ వారంలో ప్రవేశపెట్టనున్నారని,దానిపై ఓటింగ్ జరుగుతుందని స్పీకర్ నాన్సీ పెలోసి తెలిపారు. ఆదివారం సహచరులకు రాసిన లేఖలో పెలోసి ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ తీర్మాణం ఇప్పటికే సెనేటర్ టిమ్ కైనీ సెనేట్ లో ప్రవేశపెట్టిన తీర్మాణం లాంటిదేనని ఆమె తెలిపారు.

ఉన్నతస్థాయి ఇరానియన్ మిలటరీ అధికారుల లక్ష్యంగా ట్రంప్ సర్కార్… రెచ్చగొట్టే,తగని మిలటరీ ఎయిర్ స్ట్రైక్ లు అమెరికా సేవా సభ్యులు,దౌత్యవేత్తలు, ఇతరులను ప్రమాదంలో పడేసిందని పెలోసి తన సహచరులకు రాసిన లేఖలో తెలిపారు. కాంగ్రెస్ సభ్యులుగా తమ మొదటి బాధ్యత అమెరికన్ ప్రజలను సురక్షితంగా ఉంచడమేనని పెలోసి ఆ లేఖలో ప్రస్తావించారు. అయితే ఈ తీర్మాణం డెమోక్రాట్లు అధికసంఖ్యలో ఉన్న ప్రతినిధుల సభలో ఆమోదం పొందే అవకాశమున్నప్పటికీ రిపబ్లికన్ల ఆధిపత్యం ఉన్న సెనేట్ లో ఆమోదం పొందే అవకాశం కన్పించడం లేదు.

ఇరాన్‌తో శత్రుత్వం మరింత పెరగకుండా నిరోధించడానికి కాంగ్రెస్‌(అమెరికా పార్లమెంట్)లో చర్చ, ఓటింగ్ కోరుతూ శుక్రవారం డెమోక్రటిక్ సెనెటర్ టిమ్ కైనీ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బాగ్దాద్ లో సోలేమనీపై అమెరికా వైమానిక దాడి చేసేముందు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లామేకర్స్ ను గుర్తించలేదని మరియు ముందస్తు అనుమతి కోరలేదని డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. సోలేమనీ హత్యతో…ఇప్పటికే తీవ్రంగా ఉన్న అమెరాకా -ఇరాన్ ల మధ్య సంబంధాలు మరింత ముదిరాయి. విదేశీ బలగాలను తమ భూభాగంలో నుంచి పంపించేయాలని ఇరాక్ పార్లమెంట్ ఆదివారం ఓ తీర్మాణాన్ని పాస్ చేసిన విషయం తెలిసిందే