ఎక్కడికెళ్లినా ట్రంప్ బీఫ్ తినాల్సిందే.. భారత్‌లో ఈ మెనూ ఉండేనా?!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. బీఫ్ ప్రియులు. ఆయన ఎప్పుడు విదేశాలకు వెళ్లినా ఫుడ్ మెనూలో బీఫ్ ఉండాల్సిందే. బీఫ్ తినందే ఆయనకు ముద్ద దిగదు. సౌదీ అరేబియా లేదా సింగపూర్ వెళ్లినప్పుడల్లా ఒకవైపు కెచప్.. చిన్న సీసాల్లో స్టీక్ వంటి మెనూతో ఆయనకు ఇష్టమైన భోజనం పెట్టి సంతోషపెట్టేందుకు ప్రయత్నిస్తుంటాయి ఆ దేశాలు. ట్రంప్ ఇష్టంగా తినే భోజనంలో తప్పనిసరిగా బీఫ్ ఉండాల్సిందేనట..
అలాంటింది ఇప్పుడు ట్రంప్ రాకరాక భారత్ వస్తున్నారు.. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు భారత్‌లో మూడు నగరాల్లో ట్రంప్ కుటుంబ సమేతంగా పర్యటించనున్నారు. అధ్యక్షుడి డైట్‌లో తరచుగా స్టీక్స్, బర్గర్స్, మీట్ లోఫ్ కనిపిస్తుంటాయి. అలాంటిది భారత పర్యటనలో ట్రంప్ ఫుడ్ మెనూ ఏముంటుంది? అనేదానిపై ఆసక్తి నెలకొంది. ఆయనకెంతో నచ్చిన బీఫ్ దొరకడం కష్టమే? ఎందుకంటే.. ట్రంప్ పర్యటించే ఆగ్రా, ఢిల్లీ.. గుజరాత్ రాష్ట్రాల్లో హిందువులు అధికంగా ఉన్నారు. ఇక్కడ ఆవులను పవిత్రంగా భావిస్తారు.
See Also>>అహ్మదాబాద్ చేరుకున్న ట్రంప్.. భార్య, కూతురు, అల్లుడితో సహా
కొన్ని ప్రాంతాల్లో అయితే మాంసం తినడం నిషిద్ధం కూడా. ప్రపంచంలోని అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో ట్రంప్ కోసం భారీ ర్యాలీని నిర్వహించనున్నారు. తాజ్ మహల్ ను కూడా సందర్శించనున్నారు. పర్యటన సందర్భంగా ట్రంప్ విందుకు ఏర్పాట్లు చేయక తప్పుదు. ఆ విందు ఏర్పాట్లలో ట్రంప్ నచ్చిన ఫుడ్ మెనూ ఉంటుందా? ఉండదా? చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే.. మోడీ శాఖాహారి. ఆయన శాఖాహార ఆహారాన్ని మాత్రమే ట్రంప్‌కు వడ్డించాలని యోచిస్తున్నారనే విషయం తెలిసిన వ్యక్తుల అభిప్రాయం.
మోడీ భారతదేశంలో ఉన్నప్పుడు ఢిల్లీలోని అధికారిక అధ్యక్ష భవనం అయిన రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్ కోసం అధికారిక విందు ఏర్పాట్లు చేయనున్నారు. మంగళవారం సాయంత్రం ట్రంప్ ఈ విందులో పాల్గొనున్నారు. ట్రంప్ ఎప్పుడు భోజనానికి కూర్చొన్నా ఆయన మెనూలో బీఫ్ లేకుండా భోజనం ముగియదు. ఒకవేళ స్టీక్ మెనూలో బీఫ్ లేకుంటే ఆ స్థానంలో మరో ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోక తప్పదు. అనేక సందర్భాల్లో ట్రంప్‌తో కలిసి భోజనం చేసిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ట్రంప్ ప్రతిసారీ భోజనంలో సలాడ్ ఉంటుంది. కానీ, అది కాకుండా ట్రంప్ కూరగాయాలు తినడం తాను ఎప్పుడూ చూడలేదని చెప్పారు.
గతంలో, ట్రంప్ సందర్శించిన దేశాలు సైతం తరచూ ఆయనకు నచ్చిన మెనూను సిద్ధ చేస్తుంటాయి. ఒకవేళ స్టీక్ మెనులో లేకపోతే ట్రంప్ విందులో గొర్రెపిల్ల లేదా మరొక ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటారు. అయితే ట్రంప్ భారత పర్యటనలో మాత్రం మోడీ అమెరికా అధ్యక్షుడికి సాధారణ మెనూ ఫేర్ మాత్రమే అందిస్తున్నారని ఊహించటం కష్టమని పలువురు అధికారులు అభిప్రాయపడ్డారు. ట్రంప్ మెనూ కోసం మోడీ ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారో తమకు తెలియదన్నారు.
చీజ్ బర్గర్లను మాత్రం ఆయనకు వడ్డించే అవకాశం లేదని ప్రస్తుత పరిస్థితి గురించి మాజీ అధికారి ఒకరు తెలిపారు. ట్రంప్ ఫేవర్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో ఒకటైన మెక్ డొనాల్డ్ నుంచి కూడా భారత్‌లో బీఫ్ వడ్డించే పరిస్థితి లేదు. దానికి బదులుగా, స్థానికులు చికెన్ బర్గర్స్ లేదా వేయించిన పన్నీర్ చీజ్ శాండ్‌విచ్‌లతో భోజనం పూర్తి చేయాల్సిందే. ట్రంప్‌కు నచ్చిన మెనూను మోడీ సిద్ధం చేయలేకపోయినప్పటీకీ అదే స్థాయిలో అధ్యక్షుడిని ఆకర్షించేలా వెరైటీ ఇండియన్ ఫుడ్ రూపొందించనున్నట్టు విశ్వసనీయ సమాచారం.
Read More>>మోడీకి మాటిచ్చా.. భారత్ వస్తున్నా మిత్రమా!