Antarctica Ice: రోమ్ నగరమంత సైజులో అంటార్కిటికా కరిగిపోయిన మంచుముక్క: శాస్త్రవేత్తల ఆందోళన

అంటార్కిటికా ఖండంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా తూర్పు ప్రాంతంలోని మంచు పర్వతశ్రేణుల్లో ఒక మంచుముక్క విడిపోయి ప్రస్తుతం పూర్తిగా కుప్పకూలింది

Antarctica Ice: అంటార్కిటికా ఖండంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా తూర్పు ప్రాంతంలోని మంచు పర్వతశ్రేణుల్లో ఒక మంచుముక్క విడిపోయి ప్రస్తుతం పూర్తిగా కుప్పకూలిందని ఆ ధ్రువంపై పనిచేస్తున్న శాస్త్రవేత్తల బృందం తెలిపింది. గత రెండేళ్లుగా మంచు పర్వతం నుంచి విడిపోతూ వస్తున్న భారీ మంచుముక్కపై శాస్త్రవేత్తలు నిఘావుంచారు. కాంగెర్ ఐస్ షెల్ఫ్ గా పిలిచే ఈ మంచు ముక్క 1200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి దాదాపు రోమ్ నగరమంతా పరిమాణం కలిగి ఉందని భూగ్రహాల శాస్త్రవేత్త డాక్టర్ కేథరీన్ కొలెల్లో వాకర్ చెప్పారు. అయితే మంచుముక్క పూర్తిగా కరిగిపోయినా ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రమాదం లేదని..దీనిపై చేసిన పరిశోధనలు రానున్న రోజుల్లో అంటార్కిటికాపై జరిగే వాతావరణ పరిశోధనలకు మరింత దోహదపడుతుందని డాక్టర్ కేథరీన్ వెల్లడించారు.

Also Read:Story of Narendra Modi: ఇది మోదీ స్టోరీ: నరేంద్ర మోదీ జీవితంలోని స్ఫూర్తిదాయకమైన క్షణాలు

2000 సంవత్సరం తరువాత అంటార్కిటికా ఖండంలో చెప్పుకోదగిన మార్పులు చోటుచేసుకున్నాయని ఆమె తెలిపారు. తూర్పు అంటార్కిటికాలోని కాంకోర్డియా స్టేషన్ వద్ద మార్చి 18న రికార్డు స్థాయిలో “-11.8 ” డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ఇది సాధారణం కంటే(-51 డిగ్రీలు) 40 డిగ్రీలు అధికమని పరిశోధకులు పేర్కొన్నారు. అంటార్కిటికాలోని ఈ ప్రాంతంలో మంచు అడుగు భాగాన ఉష్ణమండల నదులు పారుతున్న కారణంగా ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

Also Read:Russia ukraine war : యుక్రెయిన్ పై యుద్ధంలో టార్గెట్స్ మిస్ అవుతున్న రష్యా..60 శాతం మిస్సైల్స్ విఫ‌లం

నిజానికి “కాంగెర్ ఐస్ షెల్ఫ్” ఉపరితలం 2000వ సంవత్సరం నుంచే కరుగుతున్నట్లు గుర్తించినా..2020 నుంచే పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి తలెత్తిందని డాక్టర్ కేథరీన్ వెల్లడించారు. “కాంగెర్ ఐస్ షెల్ఫ్” మంచు ముక్క పూర్తిగా మాయమవడంపై ప్రపంచ వ్యాప్తంగా వాతావరణవేత్తలు, పరిశోధకులు, భూఅధ్యయనాల శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంటార్కిటికాలో ఇది చిన్న సైజు మంచు ముక్కే అయినప్పటికీ..వాతావరణ పరిస్థితుల కారణంగా ఒక మంచు ముక్క పూర్తిగా కనుమరుగవడం ఇటీవల కాలంలో తాము చూడలేదని పరిశోధకులు అంటున్నారు.

Also Read:Earth Hour : ఈరోజు రాత్రి గం.8-30కి ఏపీలో గంటపాటు ఎర్త్ అవర్ 

ట్రెండింగ్ వార్తలు